ASBL Koncept Ambience
facebook whatsapp X

త‌న జీవితంలో అత‌డి పాత్ర కీల‌క‌మంటున్న స‌మంత‌

త‌న జీవితంలో అత‌డి పాత్ర కీల‌క‌మంటున్న స‌మంత‌

సౌత్ స్టార్ హీరోయిన్ స‌మంత(Samantha) హైద‌రాబాద్ లో ఓ మూవీ ఈవెంట్ లో స్టేజ్ పై మాట్లాడి చాలా రోజులైంది. ఖుషి(Kushi) త‌ర్వాత స‌మంత ఇప్ప‌టివ‌ర‌కు తెలుగులో మ‌రో సినిమా చేయ‌లేదు. వేరే మూవీ ఈవెంట్లకు కూడా వ‌చ్చి మాట్లాడింది లేదు. రీసెంట్ గా మినిస్ట‌ర్ కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్ల అన‌వ‌స‌రంగా స‌మంత పేరు సోష‌ల్ మీడియాలో బాగా వినిపించింది.

ఈ త‌రుణంలో స‌మంత పాల్గొన్న జిగ్రా(Zigra) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఆలియా భ‌ట్(alia Bhatt) లీడ్ రోల్ చేసిన ఈ సినిమాను తెలుగులో రానా(rana) స‌మ‌ర్పిస్తున్నాడు. ద‌స‌ర కానుక‌గా రిలీజ‌వుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స‌మంత‌తో పాటూ త్రివిక్ర‌మ్(trivikram) కూడా చీఫ్ గెస్టుగా హాజ‌ర‌య్యాడు.

ఈ సంద‌ర్భంగా స‌మంత ఇచ్చిన స్పీచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొన‌సాగింది. త‌న‌ను క‌లిసే అమ్మాయిలంద‌రికీ మీ క‌థ‌లో మీరే హీరోల‌ని చెప్పాల‌నుకుంటాన‌ని, జిగ్రా లాంటి సినిమాలు ఈ మెసేజ్‌నే ఇస్తాయ‌ని, గ‌త నెల‌లో 35 లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాను రిలీజ్ చేసిన రానా, ఇప్పుడు జిగ్రాను తెలుగులో రిలీజ్ చేస్తుండ‌టం చాలా మంచి విష‌య‌మ‌ని, రానా త‌న‌కు మంచి సోద‌రుడ‌ని, ప్ర‌తీ అమ్మాయికీ రానా లాంటి బ్ర‌ద‌ర్ ఉండాల‌ని స‌మంత ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చింది. జిగ్రా సినిమాకు సంబంధించిన వాళ్లంతా త‌న‌కు జిగ్రాలేన‌ని, రాహుల్(Rahul Ravindran) త‌న‌కు 15 ఏళ్లుగా మంచి ఫ్రెండ్ అని, త‌న లైఫ్ లో రాహుల్ ది చాలా కీల‌క పాత్ర అని చెప్పిన స‌మంత‌, తెలుగు ప్రేక్ష‌కుల ప్రేమ వ‌ల్లే ఇవాళ తాను ఈ స్థాయిలో ఉన్న‌ట్లు తెలిపింది. 

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :