ASBL Koncept Ambience
facebook whatsapp X

సినీ నటి సమంత కుటుంబంలో విషాదం

సినీ నటి సమంత కుటుంబంలో విషాదం

సినీ నటి సమంత కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్‌ ప్రభు కన్నుమూశారు. తండ్రి మరణంతో ఆమె తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. మనం మళ్లీ కలిసే వరకు నాన్న అంటూ హార్ట్‌ బ్రేకింగ్‌ ఎమోజీని జత చేశారు. ఇక జోసెఫ్‌ ప్రభు చనిపోవడానికి గల కారణం అనారోగ్య సమస్యలు అని తెలుస్తుంది. తెలుగు ఆంగ్లో ఇండియన్‌ అయిన జోసెఫ్‌ ప్రభు, నినెట్‌ ప్రభు దంపతులకు సమంత జన్మించింది. ఇక చిన్ననాటి నుంచే తన తండ్రి కెరీర్‌లో ముఖ్య పాత్ర పోషించాడు అని సామ్‌ చెప్పిన విషయం తెలిసిందే. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల్లో తన కూతురికి అండగా నిలిచాడు. అలాగే మయోసైటిస్‌తో బాధపడినప్పుడు కూడా కంటికి రెప్పాల కాపాడుకున్నాడు జోసెఫ్‌ ప్రభు. సామ్‌ తండ్రి చనిపోయిన వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా తమ సంతాపం ప్రకటిస్తున్నారు.

 


 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :