ASBL NSL Infratech

మ‌రోసారి విజ‌య్ సినిమాలో స‌మంత‌?

మ‌రోసారి విజ‌య్ సినిమాలో స‌మంత‌?

స‌మంత త‌న త‌ర్వాతి సినిమాల విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. వచ్చిన ప్ర‌తీ ఛాన్స్‌కి ఓకే చెప్ప‌కుండా త‌న పాత్ర‌కు ప్రాధాన్యం ఉన్న వాటికే స‌మంత గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది. లేట‌యినా స‌రే మంచి సినిమాలు చేయాల‌ని డిసైడైన స‌మంత‌కు రీసెంట్ గా షారుఖ్ సినిమాలో అవ‌కాశమొచ్చింద‌ని వార్త‌లొచ్చాయి. కానీ అవ‌న్నీ పుకార్లేన‌ని త‌ర్వాత అన్నారు.ఇక అస‌లు విష‌యానికొస్తే రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి రెడీగా ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ హెచ్ వినోత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌నున్న ఈ సినిమాకు విజ‌య్ రెమ్యూన‌రేష‌నే దాదాపు రూ.250 కోట్లు ఉండొచ్చ‌నే వార్త నెట్టింట కూడా బాగానే ప్ర‌చార‌మైంది.

ప్ర‌స్తుతం వినోత్ ఈ స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దుతున్న‌ట్లు తెలుస్తోంది. పొలిటిక‌ల్ ట‌చ్ తో స‌ర్కార్ కంటే స్ట్రాంగ్ మెసేజ్ ఉండేలా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొంద‌నుంద‌ట‌. ఈ సినిమాలో విజ‌య్ స‌ర‌స‌న హీరోయిన్ గా స‌మంత ఫైన‌ల్ కావొచ్చ‌ని కోలీవుడ్ ఫిల్మ్ వ‌ర్గాలంటున్నాయి. విజ‌య్ కు ఇదే చివ‌రి సినిమా కావ‌డంతో ఈ సినిమాను భారీగా తీయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అలాంటి సినిమాలో స‌మంత ఛాన్స్ అందుకుంటే నిజంగా అమ్మ‌డికి గోల్డెన్ ఛాన్స్ ద‌క్కిన‌ట్లే. ఇప్ప‌టికే విజ‌య్, స‌మంత కాంబోలో తేరి, అదిరింది సినిమాలు వ‌చ్చాయి. మ‌రోసారి ఈ కాంబో రిపీట్ అయితే ఫ్యాన్స్ ఆనందానికి హ‌ద్దులుండ‌వు. నెక్ట్స్ ఇయ‌ర్ స‌మ్మ‌ర్ లో సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ టార్గెట్ పెట్టుకున్నారు.

 

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :