ASBL Koncept Ambience
facebook whatsapp X

సముద్రుడు సినిమా ఈనెల 25న బ్రహ్మాండమైన విడుదల

సముద్రుడు సినిమా ఈనెల 25న బ్రహ్మాండమైన విడుదల

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సముద్రుడు అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. హీరో సుమన్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. సుమన్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ మరియు సినిమాలో ఉండే కామెడీ కథానుగుణంగా ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ నేపథ్యంలో నేడు ఫిల్మ్ ఛాంబర్ లో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో తలకోన ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్, డైరెక్టర్స్ సముద్ర, ప్రముఖ నిర్మాతలు రామ సత్యన్నారాయణ, ముత్యాల రాందాస్, పీపుల్ మీడియా ఎగిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాసుల శ్రీధర్, చిత్ర కో ప్రొడ్యూసర్స్ జ్ఞానేశ్వర్, సొములు, చిత్ర నిర్మాత కీర్తన తదితరులు పాల్గొన్నారు.

"మత్యకారుల జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమిది. సముద్రమే వారి జీవనాధారం, అలాంటి సముద్రంలోకి వారు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించే పరిస్థితుల్లో వారి జీవన పోరాటం, వారి మనో వేదనే ఈ చిత్రం. ఈ చిత్రంలో పెద్ద ఆర్టిస్టులు అందరూ నటించారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నిర్మాత బధావత్ కిషన్ మాట్లాడుతూ : సముద్రుడు సినిమాని ప్రేక్షకులు ముందుకు ఈనెల 25న తీసుకొస్తున్నాం. ప్రేక్షకులందరికీ నచ్చే యాక్షన్ కామెడీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పూర్తిగా ఉన్నాయి. సుమన్ గారు క్యారెక్టర్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. కథలో దమ్ముంటే తెలుగు ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరిస్తారు. మా కథలో కూడా మంచి కంటెంట్ ఉంది. కచ్చితంగా ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :