ASBL Koncept Ambience
facebook whatsapp X

స్పిరిట్ కోసం సందీప్ మెగా ప్లాన్

స్పిరిట్ కోసం సందీప్ మెగా ప్లాన్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్(Prabhas) తో సందీప్ రెడ్డి(Sandeep Reddy vanga) చేయ‌బోయే స్పిరిట్(Spirit) సినిమా షూటింగ్ ఇంకా మొద‌లుకాకుండానే దానిపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. క‌బీర్ సింగ్(Kabir singh) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా, ఆ త‌ర్వాత యానిమ‌ల్(Animal) తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని బాలీవుడ్ లోనే టాప్ డైరెక్ట‌ర్ గా మారాడు.

యానిమ‌ల్ త‌ర్వాత సందీప్ ఇప్పుడు ఏకంగా ప్ర‌భాస్(Prabhas) తోనే సినిమా చేయ‌డం చూస్తుంటే ఆయ‌న కెరీర్ గ్రాఫ్ ఎంత‌లా పెరిగిందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ ను లాక్ చేసే ప‌నిలో బిజీగా ఉన్న సందీప్ ఈ సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌ల కోసం చాలా పెద్ద క్యాస్టింగ్‌నే సెలెక్ట్ చేయ‌నున్నట్లు స‌మాచారం. ఇప్ప‌టికే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల కోసం సైఫ్ అలీ ఖాన్(Saif Ali khan), క‌రీనా క‌పూర్(Kareena Kapoor) ను ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

అంతేకాదు స్పిరిట్ లో ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్ ఉంటుంద‌ట‌. ఆ పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ని అడిగిన‌ట్లు లేటెస్ట్ న్యూస్. చిరూకి క్యామియోలు చేయ‌డం కొత్తేమీ కాదు. ఒక‌వేళ ఇది నిజ‌మైతే మాత్రం స్పిరిట్ మెంట‌ల్ మాస్ కాంబినేష‌న్ అవ‌డం ఖాయం. సందీప్ స్వ‌తహాగా మెగాస్టార్ ఫ్యాన్ అనే విష‌యాన్ని ఇప్ప‌టికే చాలా సార్లు చెప్పాడు. అలాంటి మెగాస్టార్ త‌న సినిమాలో ఒక పాత్ర చేస్తున్నాడంటే ఆయ‌న‌కు ఎలాంటి పాత్ర‌ను డిజైన్ చేసి ఉంటాడో అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతానికైతే ఇది వార్త మాత్ర‌మే. ఇందులో నిజ‌మెంత‌న్న‌ది చూడాలి మ‌రి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :