ASBL Koncept Ambience
facebook whatsapp X

ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్‌ కాన్సర్ట్‌

ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్‌ కాన్సర్ట్‌

అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్‌ నగరంలో నవంబర్‌ 3న జరిగిన శంకర నేత్రాలయ మ్యూజికల్‌ కాన్సర్ట్‌  విజయవంతమైంది. ఈ ప్రాంతంలో మొదటి తెలుగు కాన్సర్ట్‌గా నిలిచిన ఈ ఈవెంట్‌ సుమారు 120,000 డాలర్ల విరాళాలను సమీకరించింది, ఇందులో ఆరు ఎంఇఎస్‌యు  దాతల విరాళాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా డాక్టర్‌ ఎస్‌.ఎస్‌. బద్రినాథ్‌,  రతన్‌ టాటా గారిని స్మరించుకొని, వారి సేవలను కొనియాడారు. శంకర నేత్రాలయ యుఎస్‌ఎ పయనాన్ని, సంస్థ స్థాపన నుండి నేటి ప్రస్తుత కార్యక్రమాలను వివరించారు. అలాగే  వ్యవస్థాపక అధ్యక్షులు ఎమిరేటస్‌ ఎస్‌.వి. ఆచార్య , ప్రస్తుత అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వంలో సంస్థ తన సేవలను విస్తరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర దృష్టి సంరక్షణను అందించే మొబైల్‌ ఐ సర్జికల్‌ యూనిట్‌ కార్యక్రమం ద్వారా. చెన్నై, హైదరాబాద్‌, జార్ఖండ్‌ కేంద్రాలతో పాటు, పుట్టపర్తి , విశాఖపట్నం కేంద్రాల కోసం ప్రణాళికలను తెలియజేసింది.

ఈ కార్యక్రమంలోమణి శర్మ సంగీత ప్రదర్శన, ఆడియెన్స్‌ను  ఆకట్టుకుంది.  కొంతమంది  దాతలను సత్కరించారు.  అలాగే మరో ఆరు ఎంఇఎస్‌యు యూనిట్ల కోసం, తమిళనాడుకు నాలుగు, ఆంధ్రప్రదేశ్‌కు రెండు దాతలు ముందుకు వచ్చారు.

కాన్సర్ట్‌ తర్వాత, చాండ్లర్‌లోని ఫిరంగీ రెస్టారెంట్‌లో ప్రత్యేక మీట్‌-అండ్‌-గ్రీట్‌ ఏర్పాటుచేశారు, అక్కడ మణి శర్మ గారి సంతకంతో ఉన్న ఫోటోలను వేలం వేశారు. అలాగే, పియోరియాలో మణి శర్మ గారి మరియు వారి బృందానికి ప్రత్యేక సాయంకాలపు కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు వేలంపాటల ద్వారా మొత్తం  4,875 డాలర్లు సేకరించాము, ఇది శంకర నేత్రాలయ ఎంఇఎస్‌యు   కార్యక్రమం ద్వారా 75 కాటరాక్ట్‌ శస్త్రచికిత్సలకు నిధులను అందించింది.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి  సహకరించిన మూర్తి రేఖపల్లి, శ్యాం అప్పలికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, వంశీ కృష్ణ ఇరువారం (జాయింట్‌ సెక్రటరీ),ఆది మొర్రెడ్డి,, రేఖ వెమాల , ధీరజ్‌ పోలా , శరవణన్‌, శ్రీధర్‌ చెమిడ్తి, సాకేత్‌, సీత గంట, గార్లు టెర్రీ కింగ్‌, సరిత గరుడ, రాజ్‌ బండి, శోభ వడ్డిరెడ్డి, లక్ష్మి బొగ్గరపు , రూప మిధే, మణు నాయర్‌, చెన్నా రెడ్డి మద్దూరి, కాశీ, మూర్తి వెంకటేశన్‌, మంజునాథ్‌, దేవా, జయప్రకాశ్‌, మహిత్‌  కృషిని అభినందించారు. శంకర నేత్రాలయ మిషన్‌కు అండగా ఉన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలను శంకర నేత్రాలయ వారు తెలిపారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :