ASBL Koncept Ambience
facebook whatsapp X

సంక్రాంతికి వ‌స్తున్నాం విష‌యంలో దిల్ రాజు మాస్టర్ ప్లాన్

సంక్రాంతికి వ‌స్తున్నాం విష‌యంలో దిల్ రాజు మాస్టర్ ప్లాన్

టాలీవుడ్ లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి గ‌తేడాది భ‌గ‌వంత్ కేస‌రితో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి వెంక‌టేష్ హీరోగా దిల్ రాజు బ్యాన‌ర్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే అనిల్, వెంకీ కాంబోలో వ‌చ్చిన ఎఫ్‌2, ఎఫ్3 మంచి హిట్స్ అవ‌డంతో ఈ సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది.

క్రైమ్ కామెడీ జాన‌ర్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంక్రాంతికి వ‌స్తున్నాం అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంది. ఇప్ప‌టికే స‌గానికై పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను నవంబ‌ర్ లోపు పూర్తి చేయాల‌ని చూస్తున్నాడ‌ట అనిల్ రావిపూడి.

త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ స్టార్ట్ చేసి సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు. అనిల్ రావిపూడి బ్రాండ్ ఇమేజ్, దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ వాల్యూ కార‌ణంగా ఈ సినిమాకు భారీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ట‌. కానీ షూటింగ్ పూర్త‌య్యాక సినిమాపై బ‌జ్ క్రియేట్ చేసి డిమాండ్ పెరిగాక బిజినెస్ మొద‌లుపెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట దిల్ రాజు. చూస్తుంటే ఈ సినిమాకు బ‌య‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల నుంచి భారీ ఆఫ‌ర్లే వ‌చ్చేలా ఉన్నాయి కాబ‌ట్టి రిలీజ్ కు ముందే సంక్రాంతికి వ‌స్తున్నాం టేబుల్ ప్రాఫిట్ ను అందుకుంటుంద‌ని సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :