అష్టాచెమ్మాను గుర్తు చేస్తున్న సారంగపాణి
టాలీవుడ్ లో మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్లలో ఇంద్రగంటి మోహనకృష్ణ(Indraganti mohankrishna) కూడా ఒకరు. అచ్చ తెలుగు సినిమా తీయాలంటే ఒకప్పుడు జంధ్యాల(Jandhyala) ఎలాగో ఈ జెనరేషన్ లో తెలుగుదనం ఉట్టిపడేలా సినిమా తీయాలంటే ఇంద్రగంటి అలా. ఇంద్రగంటికి కెరీర్లోనే పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా అష్టాచెమ్మా(Ashta Chemma). ఆయన్నుంచి మళ్లీ అలాంటి సినిమా ఎప్పుడొస్తుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఇంద్రగంటి నుంచి వచ్చిన జెంటిల్మెన్(gentle man), సమ్మోహనం(sammohanam), వి(V), ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి(Aa ammayi gurunchi miku cheppali).. ఇవన్నీ సీరియస్ టచ్ ఉన్న సినిమాలే. అయితే వీటిలో జెంటిల్మెన్, సమ్మోహనం మాత్రమే హిట్ గా నిలిచాయి. మిగలినవన్నీ ఫ్లాపుగానే మారాయి. అయితే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఇంద్రగంటి మళ్లీ అష్టాచెమ్మా లాంటి సినిమా చేసినట్లు అనిపిస్తుంది.
ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సారంగపాణి జాతకం(Sarangapani Jathakam). జాతకాల పిచ్చి ఉన్న ఓ కుర్రాడు తన చేతిని ఓ మోడ్రన్ జ్యోతిష్యుడికి చూపించగా ఆయన చెప్పిన విషయాలను అనుసరించి తన చుట్టూ ఉన్న వారిని బెంబేలెత్తించే నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తోంది. రీసెంట్ గా రిలీజైన టీజర్ చూస్తుంటే ఆ కాన్సెప్ట్, కామెడీ అష్టాచెమ్మాను గుర్తు చేశాయి. అష్టాచెమ్మా లానే ఈ సినిమా కూడా అల్లరిగా సాగేలా ఉందనిపిస్తుంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.