ASBL NSL Infratech

రివ్యూ : షీ టీమ్ ను హైలెట్ చేస్తూ.. 'సత్యభామ' 

రివ్యూ : షీ టీమ్ ను హైలెట్ చేస్తూ.. 'సత్యభామ' 

మరో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : అవురమ్ ఆర్ట్స్
నటీనటులు: కాజల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, నేహా పఠాన్,
అంకిత్ కొయ్య, అనిరుద్ పవిత్రన్, ప్ర‌జ్వ‌ల్ యాద్మ‌ తదితరులు
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి
ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్
స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క
కో ప్రొడ్యూసర్ - బాలాజీ, నిర్మాతలు: బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి
దర్శకుడు: సుమన్ చిక్కాల
విడుదల తేదీ : 07.06.2024
నిడివి : 2 ఘంటల 23 నిముషాలు 

ఈ వారం థియేటర్స్ లో విడుదలైన మరో చిత్రం 'సత్యభామ'  స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ని  సుమ‌న్ చిక్కాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గూఢ‌చారి ఫేమ్ శ‌శికిర‌ణ్ తిక్కా స్క్రీన్‌ప్లేను అందిస్తూ...  ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించి కీల‌క పాత్ర పోషించాడు. మరి లేడీ ఓరియెంటెడ్ మూవీ స‌త్య‌భామ‌ కాజ‌ల్‌కు హిట్టు ద‌క్కిందా?   ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? అన్నది సమీక్షలో చూద్దాం.

కథ :

స‌త్య‌భామ (కాజ‌ల్ అగ‌ర్వాల్‌) షీ టీమ్‌లో ఏసీపీగా ప‌నిచేస్తుంటుంది. వృత్తి పరంగా ఒక అగ్రెసివ్, నిజాయితీ గల పోలీస్ ఆఫిసర్ అయినటువంటి సత్యభామ తన భర్త ర‌చ‌యిత అమరేందర్ (నవీన్ చంద్ర) తో ఒక హ్యాపీ జీవనాన్ని సాగిస్తుంది.  హ‌సీనా అనే యువ‌తిని ఆమె భ‌ర్త యాదు (అనిరుధ్ ప‌విత్ర‌న్‌) చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తుంటాడు. యాదు బారి నుంచి హ‌సీనాను కాపాడేందుకు స‌త్య‌భామ ప్ర‌య‌త్నిస్తుంది. అనుకోకుండా హ‌సీనా దారుణ హ‌త్య‌కు గురువుతుంది. హ‌సీనా భ‌ర్త యాదుతో పాటు ఆమె త‌మ్ముడు ఇక్భాల్ (ప్ర‌జ్వ‌ల్ యాద్మ‌) క‌నిపించ‌కుండాపోతారు. ఈ కేసులో నిర్ల‌క్ష్యంగా వ్య‌హ‌రించిన స‌త్య‌భామ‌ షీ టీమ్ నుంచి వైదొల‌గాల్సివ‌స్తుంది. హ‌సీనాను చంపిన యాదును ప‌ట్టుకోవ‌డంతో పాటు ఆమె త‌మ్ముడు ఇక్బాల్ మిస్సింగ్‌ వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించే క్ర‌మంలో స‌త్య‌భామ‌కు ఎలాంటి నిజాలు తెలిశాయి? స‌త్య‌భామ‌ ఇన్వేస్టిగేష‌న్‌లోకి ఎంపీ కొడుకు రిషి (అంకిత్ కొయ్య‌)ఎందుకొచ్చాడు?రిషితో పాటు అమ్మాయిల‌ను విదేశాల‌కు అక్ర‌మంగా త‌ర‌లించే హ్యూమ‌న్ ట్రాఫికింగ్ లీడ‌ర్స్ విజ‌య్‌, నేహాల‌తో ఇక్భాల్‌కు ఏమైనా సంబంధం ఉందా? అస‌లు హ‌సీనా ఎలా చ‌నిపోయింది? ఆమె మ‌ర‌ణం వెనుకున్న మిస్ట‌రీని స‌త్య‌భామ ఛేదించిందా? స‌త్య‌భామ జీవితంలోకి ర‌చ‌యిత అమ‌ర్ ఎలా వ‌చ్చాడు? అన్న‌దే మిగతా క‌థ‌.

సాంకేతికవర్గం పనితీరు :

సాంకేతిక టీంలో శ్రీచరణ్ పాకాల సంగీతం బాగుంది. విష్ణు బేసి సినిమాటోగ్రఫీ బాగుంది. ఇంకా కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ పర్వాలేదు కానీ చాలా కొన్ని అనవసర సీన్స్ తగ్గించాల్సింది. కొన్ని చోట్ల వేగవంతంగా అనిపిస్తుంది కానీ అది రుచించదు. డైలాగ్స్ పర్వాలేదు. ఇక దర్శకుడు ఇక దర్శకుడు సుమన్ చిక్కాల విషయానికి వస్తే దర్శకునిగా తన వర్క్ నటీనటుల విషయంలో బాగుంది. చాలా చోట్ల ద‌ర్శ‌కుడు లాజిక్‌ల‌ను వ‌దిలేశాడు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే ని శశికిరణ్ తిక్క అందించాడు. తన వర్క్ మాత్రం ఈ సినిమాలో మెప్పించే విధంగా సాగలేదు అని చెప్పాలి. చాలా రొటీన్ లైన్ సినిమాలో ఉంది కానీ దానిని ఎంగేజింగ్ గా మలచడంలో వీరు విఫలం అయ్యారు. ఒక్క కాజల్ క్యారక్టరైజేషన్ బాగుంది తప్పితే మిగతా సినిమా కన్ఫ్యూజ్ గా బోర్ కొట్టించేలా కొనసాగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మేకర్స్ సినిమాకి కావాల్సినంత ఖర్చు పెట్టారు.

విశ్లేషణ :

లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు సుమ‌న్ చిక్కాల ఈ మూవీని తెర‌కెక్కించారు. క‌మ‌ర్షియ‌ల్ మూవీలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ విష‌యంలో షీ టీమ్ బాధ్య‌త‌ను, సొసైటీలో అమ్మాయిల‌పై జ‌రుగుతోన్న అఘాయిత్యాల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా సినిమాలో చూపించారు. సందేశం ఇచ్చిన‌ట్లుగా కాకుండా క‌మ‌ర్షియ‌ల్ కోణంలోనే ఈ పాయింట్‌ను థ్రిల్లింగ్‌గా చెప్ప‌డం ఆక‌ట్టుకుంటుంది. మొత్తంగా చూసినట్టు అయితే ఈ “సత్యభామ” మాత్రం కాజల్ వన్ విమెన్ షో అని చెప్పాలి. సినిమాలో ఆకట్టుకునే కథ కథనాలు లేకపోయినా ఆమె మాత్రం తన నటన యాక్షన్ పెర్ఫామెన్స్ లతో అదరగొడుతుంది.  సినిమాలో కథా కథనాల్లో లోపం ఉన్నాయి. బోరింగ్ అండ్ కన్ఫ్యూజ్ గా సాగే కథనాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.  ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమా ట్రై చేస్తే బెటర్.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :