ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆ మాట‌తో ఫ్యాన్స్ ను నిరాశ ప‌రిచిన కార్తీ

ఆ మాట‌తో ఫ్యాన్స్ ను నిరాశ ప‌రిచిన కార్తీ

తెలుగులో త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కార్తీ కొత్త సినిమా స‌త్యం సుంద‌రం సెప్టెంబ‌ర్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రావాలి. వాస్త‌వానికి త‌మిళంతో పాటూ దేవ‌ర సినిమా రిలీజ్ రోజే ఇది కూడా రిలీజవ్వాలి కానీ దేవ‌ర హైప్ లో థియేట‌ర్లు ద‌క్కుతాయో లేదోన‌ని ఒక రోజు లేటుగా సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.

96 లాంటి క‌ల్ట్ క్లాసిక్ ఇచ్చిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు డైరెక్ట‌ర్ అవ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. అంతా బానే ఉంది కానీ ఇందులో సాంగ్స్, ఫైట్స్ ఏమీ ఉండ‌వ‌ని రీసెంట్ గా జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీ చెప్ప‌డంతో ఆయ‌న ఫ్యాన్స్ ఒక్క‌సారిగా షాక‌య్యారు. సినిమాలో ఎంత కంటెంట్ ఉన్న‌ప్ప‌టికీ కార్తీ లాంటి హీరోని పెట్టుకుని మినిమమ్ మాస్ ఎలిమెంట్స్ లేక‌పోతే ఎలా ఫ్యాన్స్ నిరాశ ప‌డుతున్నారు.

పాట‌లు, ఫైట్లు లేక‌పోయినా స‌త్యం సుంద‌రంలో అంత‌కుమించి వినోదం ఉంటుంద‌ని సినిమా చూశాక క‌చ్ఛితంగా ఓ మంచి సినిమా చూశామ‌నే తృప్తి క‌లుగుతుంద‌ని కార్తీ తెలిపాడు. దేవ‌ర లాంటి సినిమాను పోటీగా పెట్టుకుని కార్తీ స‌త్యం సుంద‌రంతో ప్ర‌యోగం చేస్తున్నాడు. ఇలాంటి ప్ర‌యోగాలు బాక్సాఫీస్ ఓపెనింగ్స్ మీద ప్ర‌భావం చూపించ‌డం ఖాయం. మ‌రి కార్తీ ఈ సినిమాతో ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాడో చూడాలి.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :