ASBL NSL Infratech

ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్ గురించి శంక‌ర్ ఏమంటున్నాడంటే

ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్ గురించి శంక‌ర్ ఏమంటున్నాడంటే

 

ఇండియ‌న్ సినిమాలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్. ఇప్పుడంటే అంద‌రూ భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తున్నారు కానీ 90ల్లోనే శంక‌ర్ ఈ రేంజ్ సినిమాలు చేశాడు. ఆయ‌న తీసిన సినిమాలు ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించాయి. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రోబో గురించి ఎంత చెప్పినా తక్కువే. రోబో టైమ్ లో ఇండియ‌న్ స్క్రీన్ మీద అలాంటి విజువ‌ల్స్ ను ఎవ‌రూ ఊహించలేదు కూడా. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఇండియ‌న్2 త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌మోష‌న్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా శంక‌ర్ త‌ను ఫ్యూచ‌ర్ లో చేయ‌బోయే సినిమాల గురించి చెప్పాడు.

గేమ్ ఛేంజ‌ర్, ఇండియ‌న్2 త‌ర్వాత తాను మూడు భారీ బ‌డ్జెట్ సినిమాలు తీయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఆ మూడు సినిమాలూ లేటెస్ట్ టెక్నాల‌జీని వాడుకుని చేయ‌బోయే విజువ‌ల్ వండ‌ర్స్ అని ఆయ‌న స్ప‌ష్టం చేశాడు. అందులో ఒక‌టి చారిత్ర‌క నేప‌థ్య‌మున్న సినిమా కాగా, మ‌రొక‌టి జేమ్స్ బాండ్ త‌ర‌హా యాక్ష‌న్ సినిమా, మ‌రొక‌టి సైన్స్ ఫిక్ష‌న్ సినిమా అని శంక‌ర్ తెలిపాడు. అయితే తాను కావాల‌ని ముందే అనుకుని భారీ బ‌డ్జెట్ సినిమాలు తీయ‌న‌ని, క‌థ డిమాండ్ చేయ‌డం వ‌ల్లే బ‌డ్జెట్ భారీగా అవుతుంద‌ని, తాను చేయ‌బోయే మూడు సినిమాలూ అత్యాధునిక టెక్నాల‌జీతో తెర‌కెక్క‌నున్నాయని, అన్నింట్లో వీఎఫ్ఎక్స్ కు ప్రాధాన్య‌ముంటుంద‌ని శంక‌ర్ తెలిపాడు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :