ASBL Koncept Ambience
facebook whatsapp X

ఇండియ‌న్2 కు రెహ‌మాన్ ఎందుకు వ‌ర్క్ చేయ‌లేదంటే..

ఇండియ‌న్2 కు రెహ‌మాన్ ఎందుకు వ‌ర్క్ చేయ‌లేదంటే..

త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా వ‌స్తుందంటే దానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఏఆర్ రెహ‌మాన్ ఉండాల్సిందే. కొన్ని త‌ప్ప‌ని ప‌రిస్థితుల వ‌ల్ల అప‌రిచితుడు, స్నేహితుడు సినిమాల‌కు రెహ‌మాన్ శిష్యుడైన హారిస్ జ‌య‌రాజ్ తో ఆ సినిమాల‌ను చేయించుకున్నాడు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మిగిలిన సినిమాల‌న్నింటికీ రెహ‌మానే సంగీతం అందించాడు.కానీ ఇండియ‌న్2 సినిమాకు మాత్రం రెహమాన్ తో కాకుండా, హారిస్ తో కాకుండా అనిరుధ్ తో వ‌ర్క్ చేయించుకున్నాడు. ఇండియ‌న్ సినిమాకు రెహ‌మాన్ అందించిన సంగీతం మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్. అయిన‌ప్ప‌టికీ రెహ‌మాన్ ను తీసుకోకుండా అనిరుధ్ ను తీసుకున్నాడు శంక‌ర్. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో శంక‌ర్ ఈ విష‌యంలో క్లారిటి ఇచ్చాడు.

రోబో 2.0 చేస్తున్న‌ప్పుడే ఇండియ‌న్2 వ‌ర్క్స్ స్టార్ట్ అయ్యాయ‌ని, క‌మ‌ల్ డేట్స్ కూడా కేటాయించాడ‌ని, కుదిరినంత త్వ‌ర‌గా సినిమాను స్టార్ట్ చేయాల్సిన అవ‌స‌ర‌ముండ‌టం.. ఆ టైమ్ లో రెహ‌మాన్ 2.0 బీజీఎం వ‌ర్క్స్ లో బిజీగా ఉండ‌టంతో పాటూ వేరే క‌మిట్‌మెంట్స్ కూడా ఉండ‌టం వ‌ల్ల ఈ జెన‌రేష‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన అనిరుధ్ ని ఇండియ‌న్2 కి సెలెక్ట్ చేసుకున్నట్లు తెలిపాడు శంక‌ర్. ఈ నెల 12న ఇండియ‌న్2 ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :