ASBL Koncept Ambience
facebook whatsapp X

సిద్ధార్థ్, అదితి పెళ్లి ఎక్క‌డ జ‌ర‌గ‌నుందంటే

సిద్ధార్థ్, అదితి పెళ్లి ఎక్క‌డ జ‌ర‌గ‌నుందంటే

సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో సినీ జంట త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నున్నారు. కొన్నేళ్ల నుంచి ర‌హస్యంగా ల‌వ్ స్టోరీని న‌డిపి, కొన్ని నెల‌ల కింద‌ట సైలెంట్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సిద్ధార్థ్, అదితిరావు ఇప్పుడు పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. త‌మ పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుంద‌నేది చెప్ప‌లేదు కానీ ఎక్క‌డ జ‌రుగుతుంద‌నే విష‌యం మాత్రం స్వ‌యంగా పెళ్లికూతురు అదితినే వెల్ల‌డించింది.

త‌మ పూర్వీకులకు ఎంతో ప్ర‌త్యేక‌మైన వ‌న‌ప‌ర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగ‌నాథి స్వామి గుడిలో త‌మ పెళ్లి జ‌ర‌గ‌నున్న‌ట్లు అదితి తెలిపింది. త‌మ ఎంగేజ్‌మెంట్ కూడా అక్క‌డే జ‌రిగిన విష‌యాన్ని అదితి స్ప‌ష్టం చేసింది. పెళ్లి డేట్ ఎప్పుడ‌నేది ఇంకా ఫిక్స్ అవ‌లేద‌ని, తాను, సిద్ధార్థ్ క‌లిసి డిసైడ్ అయ్యాక క‌లిసి అనౌన్స్ చేస్తామ‌ని ఆమె ప్ర‌క‌టించింది.

మహా స‌ముద్రం సినిమా టైమ్ లో త‌న‌కు, సిద్ధార్థ్ కు ప‌రిచ‌య‌మై కొంత కాలానికి ఫ్రెండ్సై ఆ త‌ర్వాత ప్రేమ‌లో ప‌డిన‌ట్లు అదితి చెప్పుకొచ్చింది. అదితికి త‌న నాన‌మ్మ అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. హైద‌రాబాద్‌లో ఆమెకు ఒక స్కూల్ కూడా ఉంద‌ట‌. ఆ స్కూల్ లోనే అదితి ఎక్కువ రోజులు టైమ్ స్పెండ్ చేసింద‌ట‌. కొన్నాళ్ల కింద‌ట అదితి నాన‌మ్మ చ‌నిపోగా, ఆ విష‌యాల‌న్నీ తెలుసుకున్న సిద్దు ఒక రోజు ఆ స్కూల్ కు తీసుకెళ్ల‌మ‌ని అడిగాడ‌ని, ఆ స్కూల్లోనే తన‌కు మోకాళ్ల‌పై కూర్చుని ప్రపోజ్ చేశాడ‌ని, నాన‌మ్మ‌కు ఇష్ట‌మైన ప్లేస్ లో ఆమె ఆశీస్సుల కోస‌మే అలా చేశాడ‌ని, సిద్ధూ ప్రేమ‌ను వ్య‌క్తం చేసిన తీరు త‌న‌కెంతో న‌చ్చింద‌ని అదితి చెప్పుకొచ్చింది.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :