శివ రేంజ్ మారిపోయిందిగా
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ గా ఎదిగాడు కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan). ఒకప్పుడు టీవీలో వీడియో జాకీగా పనిచేసిన శివ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి కొన్నేళ్ల పాటూ చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు. ధనుష్(Dhanush) నిర్మాణంలో వచ్చిన ఎదిరి నీచ్చిల్(Ediri Neechil) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు శివ కార్తికేయన్.
రెండో సినిమా వరుత్త పడాద వాలిబర్ సంఘం(Varutha Padaadha valibar sangam) దాన్ని మించిన హిట్ అవడంతో శివకు హీరోగా వెనక్కి తిరిగి చూసుకునే పని రాలేదు. అయితే శివ ఇప్పటివరకు చూసిన హిట్లు వేరు. అమరన్(Amaran) సినిమాతో అందుకున్న హిట్ వేరు. ఇప్పటివరకు శివ అంటే మిడ్ రేంజ్ హీరో. తన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే రూ.60-70 కోట్లు కలెక్ట్ చేసేవి.
డాక్టర్(Doctor) సినిమాతో రూ.100 కోట్లు సాధించి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శివ, ఇప్పుడు ఏకంగా అమరన్ తో రూ.300 కోట్ల క్లబ్ లో జాయిన్ అయేట్లున్నాడు. ఈ సినిమా రిలీజై రెండు వారాలవుతున్నా ఇంకా థియేటర్ల దగ్గర జోరు మాత్రం తగ్గలేదు. స్టార్ హీరో సూర్య(suriya) నటించిన కంగువ(Kanguva) రిలీజవుతున్నా అమరన్ సినిమా ఉండటం వల్ల కంగువకు భారీ థియేటర్లు దొరకని పరిస్థితి నెలకొందంటే అమరన్ రేంజ్ అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తుంటే అమరన్‌తో శివ కార్తికేయన్ టాప్ లీగ్ స్టార్లకు చాలా దగ్గరకు వెళ్లినట్లు అర్థమవుతుంది.