ASBL Koncept Ambience
facebook whatsapp X

చిన్న సినిమాలు.. పెద్ద విజ‌యాలు..

చిన్న సినిమాలు.. పెద్ద విజ‌యాలు..

పెద్ద బ‌డ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చి మంచి క‌లెక్ష‌న్స్ సాధించ‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదు. కానీ చిన్న బ‌డ్జెట్ తో తెర‌కెక్కి ఆ సినిమాకు క‌నీసం ఓపెనింగ్స్ వ‌స్తాయో లేదో అనుకున్న సినిమాలు అంద‌రి అంచ‌నాల‌ను మించి ఆడియ‌న్స్ ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం చూసి అంద‌రూ షాక‌వుతున్నారు.

గ‌త రెండు నెల‌ల్లో టాలీవుడ్ లో రిలీజైన చిన్న సినిమాలు దీనికి ఉదాహ‌రణ‌లు. ముందుగా మెగా డాట‌ర్ నిహారిక నిర్మాత‌గా వంశీ య‌దును డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌యం చేస్తూ చిన్న సినిమాగా వ‌చ్చిన క‌మిటీ కుర్రోళ్లు అంద‌రి అంచ‌నాల‌ను మించి సూప‌ర్‌హిట్ అందుకుంది. త‌ర్వాత ర‌వితేజ‌, రామ్, విక్ర‌మ్ లాంటి పెద్ద హీరోల సినిమాల‌తో పోటీ ప‌డిన ఆయ్ మూవీ ఊహించ‌ని విధంగా హిట్ట‌యింది.

అంజి కె ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్2 బ్యాన‌ర్ లో వ‌చ్చిన  ఈ సినిమా నిర్మాత‌ల‌కు మంచి లాభాల‌ను తెచ్చిపెడుతుంది. రానా స‌మ‌ర్ప‌కుడిగా వ‌చ్చిన 35 సినిమా కూడా వ‌సూళ్ల ప‌రంగా వావ్ అనిపించుకోక‌పోయినా ఉన్నంత‌లో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు ముందునుంచే మంచి ప్ర‌మోష‌న్స్ చేస్తే సినిమా స్థాయి నెక్ట్స్ లెవెల్ కు వెళ్లేది. ఇక తాజాగా రిలీజైన మ‌త్తు వ‌ద‌ల‌రా2 బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. స‌త్య కామెడీకి యునానిమ‌స్ పాజిటివ్ టాక్ రావ‌డం నిర్మాణ సంస్థ మైత్రీ కు మంచి లాభాల‌నందిస్తోంది. అయితే ఈ సినిమాల్లో స్టార్ క్యాస్టింగ్ ఏమీ లేదు. ఈ సినిమాల్లో కంటెంటే కింగ్. ఇలాంటి వాటిని ఆడియ‌న్స్ ఓటీటీలోనే చూస్తార‌నే అపోహ‌ను ఈ సినిమాలు పోగొట్టి అప్ క‌మింగ్ మేక‌ర్స్ కు మంచి బూస్ట‌ప్ ఇస్తున్నాయి.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :