ASBL Koncept Ambience
facebook whatsapp X

SOUTH KOREA: దక్షిణకొరియా అధ్యక్షుడికి పదవీ గండం

SOUTH KOREA: దక్షిణకొరియా అధ్యక్షుడికి పదవీ గండం

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌(Yoon Suk Yeol) .. అతివిశ్వాసంతో చేశారో..అనాలోచితంగా చేశారో.. ఇంకా ఏదైనా ప్రణాళిక ఉందో తెలియదు కానీ.. ఎమర్జెన్సీ ప్రకటించి అభాసుపాలయ్యారు. ఆయన మార్షల్ లా(martial law) ప్రకటించడంతో .. పార్లమెంటు అంతా ఒక్కటైంది. అర్థరాత్రి వేళ సభ సమావేశం కావడం... మార్షల్ లాను వ్యతిరేకిస్తూ చేసిన వ్యతిరేకిస్తూ తీర్మానం పాస్ చేసింది. దీంతో మార్షల్ లా రద్దైంది. ఇక చేసేదేమీ లేక అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ మార్షల్ లాను రద్దు చేసినట్లు ప్రకటించారు.

‘‘ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ శక్తుల నుండి ఎదురయ్యే బెదిరింపుల నుండి ఉదారవాద దక్షిణ కొరియాను రక్షించడానికి మరియు రాష్ట్ర వ్యతిరేక అంశాలను నిర్మూలించడానికి అత్యవసర మార్షల్ చట్టాన్ని ప్రకటిస్తున్నాను’’ అని యూన్ దేశాన్ని ఉద్దేశించి టీవీలో ప్రసంగించారు. ప్రజల జీవనోపాధితో సంబంధం లేకుండా అభిశంసనలు, ప్రత్యేక దర్యాప్తులు, న్యాయం నుంచి తమ నాయకులను రక్షించడానికి ప్రతిపక్ష పార్టీలు పాలనను స్తంభింపచేస్తున్నాయని మండిపడ్డారు. “మన జాతీయ అసెంబ్లీ నేరస్థులకు స్వర్గధామంగా మారింది, ఇది న్యాయ మరియు పరిపాలనా వ్యవస్థలను స్తంభింపజేయడానికి, మన ఉదారవాద ప్రజాస్వామ్య క్రమాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని అధ్యక్షుడు అన్నారు.

ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. యూన్‌ సుక్‌ యోల్‌ మంగళవారం సాయంత్రం ‘ఎమర్జెన్సీ మార్షల్‌ లా’ (Emergency Martial Law) విధించారు. ‘ఉత్తరకొరియా అనుకూల శక్తులను’ ఏరివేసేందుకు ఇదే సరైన నిర్ణయం అని పేర్కొన్నారు. 1980 తర్వాత దేశంలో మార్షల్‌ లా విధించడం మళ్లీ ఇప్పుడే. అధ్యక్షుడి ప్రకటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేయడమే గాక.. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అధ్యక్షుడి ప్రకటనతో రంగంలోకి దిగిన సైన్యం పార్లమెంటు, ఇతర రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని హుకుం జారీచేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్‌) వెలుపల వేలాది మంది నిరసనకు దిగారు. వారిని భద్రతా బలగాలు అడ్డుకోవడం ఘర్షణలకు దారితీసింది.

మార్షల్ లాను తీవ్రంగా వ్యతిరేకించిన పార్లమెంటు(parliment)

అటు జాతీయ అసెంబ్లీలోనూ ఇదే పరిస్థితి కన్పించింది. అధ్యక్షుడి నిర్ణయాన్ని ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది సొంత పార్టీ నుంచి కూడా దీనిపై వ్యతిరేకత వచ్చింది. దీంతో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ‘మార్షల్‌ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించడం గమనార్హం. అనంతరం మార్షల్‌ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్‌ ప్రకటించారు.

వెనక్కి తగ్గిన యూన్‌..(yoon backstep)

స్పీకర్‌ నిర్ణయం నేపథ్యంలో అధ్యక్షుడు యూన్‌ తన నిర్ణయంపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దక్షిణ కొరియా చట్టప్రకారం పార్లమెంటులో మెజారిటీ ఓటు ద్వారా ఎమర్జెన్సీని ఎత్తేయవచ్చు. దీంతో ఎమర్జెన్సీ విధిస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు యూన్‌ మరో ప్రకటన చేశారు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) అత్యయిక పరిస్థితిని అధికారికంగా ఎత్తివేశారు.

రాజీనామా చేయాల్సిందేనంటున్న విపక్షాలు

ఈ పరిణామాలతో అధ్యక్షుడిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. యూన్‌ తక్షణమే రాజీనామా చేయాలని లేదంటే అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోవాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిమాండ్‌ చేసింది. దీనిపై యూన్‌ ఇంకా స్పందించలేదు. అయితే ఆయన పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు. ఈక్రమంలోనే బుధవారం జరగాల్సిన తన అధికారిక షెడ్యూల్‌ను కూడా ఆయన రద్దు చేసుకున్నారు.

దక్షిణకొరియా పార్లమెంట్‌లో 300 మంది సభ్యులున్నారు. ఒకవేళ అధ్యక్షుడు అభిశంసనను గట్టెక్కాలంటూ 2/3 వంతు మెజార్టీ అంటే 200 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ, ఇతర చిన్న విపక్ష పార్టీలంతా కలిపి 192 మంది ఉన్నారు. అధ్యక్షుడి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిన్న రాత్రి తీసుకొచ్చిన తీర్మానం 190-0తో నెగ్గింది. ఈ పరిణామాలన్నీ చూస్తే యూన్‌ పదవి నుంచి దిగిపోవడం ఖాయంగానే కన్పిస్తోంది.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :