ASBL Koncept Ambience
facebook whatsapp X

క్రేజీ ఆఫ‌ర్ ప‌ట్టేసిన శ్రీలీల‌

క్రేజీ ఆఫ‌ర్ ప‌ట్టేసిన శ్రీలీల‌

మొద‌ట క‌న్న‌డ సినిమాల్లో న‌టించి త‌ర్వాత పెళ్లి సంద‌డి2తో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన శ్రీలీల త‌క్కువ కాలంలోనే వ‌రుస అవ‌కాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గ‌తేడాది వ‌రుస సినిమాలు చేసిన శ్రీలీల ఇప్పుడు త‌న స్పీడు కాస్త త‌గ్గించింది. ప్ర‌స్తుతం అమ్మ‌డు టాలీవుడ్ లో ర‌వితేజ తో ఓ సినిమా, రాబిన్ హుడ్, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాల్లో న‌టిస్తోంది.

వీటితో పాటూ మ‌రికొన్ని సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌ల్లో ఉన్నాయి. అయితే శ్రీలీల త‌మిళ‌, క‌న్న‌డ సినిమాల్లో కూడా న‌టించాల‌ని ఆశ ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలోనే అమ్మ‌డికి ప్ర‌స్తుతం ఉన్న పెద్ద సినిమాల‌కు తోడు కెరీర్లోనే అతి పెద్ద సినిమాను క‌మిట్ అయింద‌ని వార్త‌లొస్తున్నాయి. త‌మిళ స్టార్ హీరో అజిత్ సినిమాలో న‌టించే ఛాన్స్ శ్రీలీల ద‌క్కించుకుంద‌ట‌.

ప్ర‌స్తుతం అజిత్ న‌టిస్తున్న విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల షూటింగ్ స‌మాంత‌రంగా జ‌రుగుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఓ సినిమాలో శ్రీలీల ఛాన్స్ కొట్టేసిందని కోలీవుడ్ మీడియా వ‌ర్గాల స‌మాచారం. అజిత్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా న‌టిస్తుందా లేక ఏదైనా స్పెష‌ల్ సాంగ్ చేస్తుందా అన్న‌ది తెలియ‌దు కానీ ఏదైనా స‌రే అజిత్ సినిమాలో ఛాన్స్ అంటే కోలీవుడ్ లో మంచి గుర్తింపు రావ‌డం ఖాయం. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఈ విష‌యంలో అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :