ASBL Koncept Ambience
facebook whatsapp X

శ్రీసిటీలోని ఆక్సిలెంట్ ఫార్మా పరిశ్రమకు ప్రతిష్టాత్మక 'హెల్త్ కెనడా' సర్టిఫికెట్ 

శ్రీసిటీలోని ఆక్సిలెంట్ ఫార్మా పరిశ్రమకు ప్రతిష్టాత్మక 'హెల్త్ కెనడా' సర్టిఫికెట్ 

శ్రీసిటీలోని ఆక్సిలెంట్ ఫార్మా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు ప్రతిష్టాత్మక 'హెల్త్ కెనడా కరెంట్ గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్' (cGMPs) సర్టిఫికెట్ దక్కింది. కంపెనీ నాన్-స్టెరైల్ సదుపాయం కోసం ఈ గుర్తింపు అందుకుంది. సర్టిఫికెట్ అందించే సంస్థ ఈ ఏడాది సెప్టెంబర్ 16-20 తేదీల మధ్య పరిశ్రమను సందర్శించి నాణ్యత తనిఖీలు నిర్వహించింది.  

ఈ సర్టిఫికెట్ పొందడం తమకెంతో సంతోషంగా ఉందంటూ ఆక్సిలెంట్ ఫార్మా కంపెనీ ఛైర్మన్ జితేష్ దేవేంద్ర పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు తమ సంస్థకు మరింత విలువను జోడిస్తుందన్నారు. తమ కంపెనీ నాన్-స్టెరైల్ సదుపాయంలోని ఓరల్ సాలిడ్, ఓరల్ లిక్విడ్, సెమి సాలిడ్ ఉత్పత్తులకు సంబంధించి ఈ తనిఖీలు జరిగాయని చెప్పారు. గతంలో తమ ఇతర ఉత్పత్తులకు సంబంధించి US FDA తనిఖీలు చేపట్టి సర్టిఫికెట్ అందజేసినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది తమ స్టెరైల్ సదుపాయంకు సంబంధించి కూడా విజయవంతంగా తనిఖీలు పూర్తి అవుతాయని చెప్పారు. ఇది తమ కంపెనీ నాణ్యత, నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు.  

హెల్త్ కెనడా cGMP అనేది ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఆహార ఉత్పత్తులకు సంబంధించి భద్రత, నాణ్యత నిర్ధారించే మార్గదర్శకాలను రూపొందించే సంస్థ. ఈ మేరకు నిర్దేశిత సదుపాయంలో పరికరాల రూపకల్పన నుండి ఉత్పత్తుల పరీక్ష, నిల్వ, పంపిణీ వరకు తయారీదారులు cGMP నిబంధనలను అనుసరించాలి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :