ASBL Koncept Ambience
facebook whatsapp X

సిఐఐ "సీఎఫ్ఓ ఎక్సలెన్స్ అవార్డ్" అందుకున్న శ్రీసిటీ సీఎఫ్ఓ

సిఐఐ "సీఎఫ్ఓ ఎక్సలెన్స్ అవార్డ్" అందుకున్న శ్రీసిటీ సీఎఫ్ఓ

శ్రీసిటీని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) సంస్థ వారి "సీఎఫ్ఓ ఎక్సలెన్స్ అవార్డ్" శ్రీసిటీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) ఆర్.నాగరాజన్ కు దక్కింది. గురువారం బెంగుళూరులో నిర్వహించిన సదరన్ రీజియన్ సిఐఐ సీఎఫ్ఓ ఎక్సలెన్స్ అవార్డుల మూడవ ఎడిషన్‌ కార్యక్రమంలో ఈ అవార్డును అందచేశారు. సిఐఐ మాజీ ప్రెసిడెంట్, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్, యాక్సిలర్ వెంచర్స్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్, సిఐఐ సిఎఫ్ఓ  ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023-2024 చైర్మన్, భారత్ వోల్వో గ్రూప్ ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్ కమల్ బాలి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. మౌళిక వసతుల కల్పన రంగంలో ఆర్థిక నిపుణుడుగా తాను చూపిన అసాధారణమైన ప్రతిభ, కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. 

సీఎఫ్ఓ కు అభినందనలు తెలిపిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఈ ప్రతిష్టాత్మిక అవార్డు గెలుచుకోవడం తమకు చాలా గర్వంగా వుందన్నారు. ఆర్థికరంగ నిపుణులను ప్రోత్సహిస్తూ ఏటా అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సిఐఐ సంస్థను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

కాగా, అత్యంత ప్రభావవంతమైన సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఆర్థిక నిపుణులను గుర్తిస్తూ సిఐఐ సంస్థ ప్రతి సంవత్సరం అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  వివిధ రంగాలలో పలు కీలక అంశాలలో ప్రతిభ ఆధారంగా ఫైనాన్స్ నిపుణులను ఇది గుర్తిస్తుంది. ఈ పురస్కారంలో భాగంగా ట్రోఫీ మరియు ప్రశంసాపత్రం అందచేశారు. 

ప్రస్తుత ప్రతిష్టాత్మక అవార్డుతో పాటు గతంలో పలు అవార్డులను నాగరాజన్ అందుకున్నారు. 2022లో సీఎఫ్ఓ ఇండియా సంస్థ నుండి  సీఎఫ్ఓ-100 అవార్డు, 2021లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుండి 'బెస్ట్ సిఎంఏ సీఎఫ్ఓ' అవార్డు, 2021లో ఆసియా సీఎఫ్ఓ లీడర్‌షిప్ అవార్డులలో 'సీఎఫ్ఓ ఆఫ్ ది ఇయర్' గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. 
 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :