ASBL Koncept Ambience
facebook whatsapp X

ఫ్రీమాంట్ - కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ లో పూజలు నిర్వహించిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ.. 

ఫ్రీమాంట్ - కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ లో పూజలు నిర్వహించిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ.. 

అవదూత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ శుక్రవారం, 16 ఆగస్టు 2024 తేదీ సాయత్రం ఫ్రీమాంట్ లో కొత్త గా నిర్మాణంలో వున్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో భక్తుల సమక్షంలో శ్రీ చక్ర పూజ చేసి, భక్తులకు అనేక విషయాలు వివరిస్తూ "అమెరికా వెస్ట్ కోస్ట్ లో ప్రజలకు రక్షణ గా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్ల వేళలా వుండేందుకు, అందరూ క్షేమంగా వుండేందుకు ఈ ఫ్రీమాంట్ నగరం లో శ్రీ కార్య సిద్ది హనుమాన్ టెంపుల్ వుండటం చాల అవసరం. ఆ ఆలోచన కార్య రూపం దాల్చి ఈ రోజు ఏ స్థితి కి వచ్చినందుకు చాలా సంతోషం" అన్నారు. భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ స్వామిజీ "ప్రతి వ్యక్తి  బయట వారిని కాకుండా తనను తాను ప్రశ్నించుకోవటం అలవాటు చేసుకోవాలి.. ఆ విధంగా తాను చేస్తున్న పనులు మంచి మార్గంలోకి తెచ్చుకోవాలి. మంచి పనులు చేయటానికి గట్టి సంకల్పం తీసుకోవాలి" అని  చెప్పారు..

"కార్య సిద్ధి హనుమాన్ టెంపుల్, ఫ్రీమాంట్ కోసం నేను, నాతో పాటు కొందరు వ్యక్తులు గట్టిగా సంకల్పించాము కాబట్టి ఇప్పటికీ మనకి గుడి ప్రాంగణం దొరికింది. ఈ ప్రాపర్టీ కొనడానికి డల్లాస్ లోని కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, మైసూర్ లోని దత్త పీఠం చాలా డబ్బు ఇచ్చింది. ఈ గుడి మీ కాలిఫోర్నియా వాసుల క్షేమం కోసం ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఈ గుడిని బాగా వృద్ధి చేసుకోండి" అని శ్రీ స్వామీజీ చెప్పారు.

అంతకు ముందు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, ఫ్రీమాంట్ గురించి  శ్రీ మెహుల్ పటేల్ మాట్లాడుతూ "మొదటగా మే 2023 లో శ్రీ స్వామికి  ఆస్ట్రేలియా, మెల్బోర్న్ నుంచి  ఫోన్ చేసి బే ఏరియా లో ఒక హనుమాన్ టెంపుల్ నిర్మించాలని చెప్పారు.. అప్పటి నుంచి డిసెంబర్ 2023 చివరి వరకు ఎంత వెతికినా సరి అయిన ప్రాపర్టీ దొరక లేదు. ఇప్పుడున్న ప్రాపర్టీ కూడా డిసెంబర్ లో ప్రయత్నం చేస్తే దొరకలేదు. ఆప్పుడు స్వామిజీ మమ్మల్ని 40 రోజులు అనఘాదేవీ వ్రతం చేయమని చెప్పారు. 4 జనవరి 2024 నుంచి కొంత మంది మహిళలు 40 రోజులు భక్తి తో అనఘా దేవి వ్రతం చేయడం, 24 ఫిబ్రవరి తేదీన ఈ ప్రాపర్టీ అమ్మకానికి రావడం, 29 ఫిబ్రవరి న మనం కొనటానికి సంసిద్ధత తెలుపుతూ డాక్యుమెంట్స్ ఇవ్వడం, మార్చ్ లో ఈ ప్రాపర్టీ ఓనర్స్ అంగీకరించటం జరిగింది. అంతా ఒక మిరాకిల్ లాగా అయిపోయింది. ఈ గుడి ప్రాంగణం లో శ్రీ ఆంజనేయ స్వామి మూర్తి, శ్రీదేవి - భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర  స్వామి మూర్తులు, కాశీ నుంచి తెచ్చిన శివ  మూర్తులు ఉన్నాయని, పూజలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం  ప్రార్థనా తరగతులు, యోగా తరగతులు కూడా మొదలయ్యాయి. త్వరలోనే మా వెబ్ సైట్ కూడా వస్తుందని, వచ్చే సంవత్సరం లోపు ఇప్పుడున్న ఉత్సవ మూర్తుల బదులు గా పూర్తి స్థాయిలో మూర్తులను ప్రతిష్ఠిస్తామని శ్రీ మేహూల్ పటేల్ చెప్పారు. 

శ్రీ మేహూల్ పటేల్, శ్రీ ఆనంద్ విపర్తి, శ్రీ రాజేష్ గుసిడి యాజమాన్యం లో వున్న ఈ కార్య సిద్ది హనుమాన్ టెంపుల్, ఫ్రీమాంట్ లో (4300 Hansen Avenue, Fremont, CA 94536) వుంది. అందరికీ ఇదే ఆహ్వానం. 

 

 


 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :