ASBL Koncept Ambience
facebook whatsapp X

హిట్ కొట్టినా అయోమ‌యంలోనే ఉన్న హీరో

హిట్ కొట్టినా అయోమ‌యంలోనే ఉన్న హీరో

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహాకు రాజ‌మౌళి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కెరీర్ స్టార్టింగ్ లో ఉప‌యోగ‌ప‌డింది కానీ త‌ర్వాత మాత్రం అదేమీ లెక్క‌లోకి రావ‌డం లేదు. దానికి కార‌ణం త‌న‌కు హిట్లు లేక‌పోవ‌డ‌మే. మ‌త్తు వ‌ద‌ల‌రా సినిమాతో మంచి డెబ్యూ అందుకున్న సింహా త‌ర్వాతి సినిమాలు ఏవీ బాక్సాఫీస్ వ‌ద్ద మెప్పించ‌లేక‌పోయాయి.

మ‌ళ్లీ చాలా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చిన మ‌త్తు వ‌ద‌ల‌రా2 శ్రీ సింహాకి హిట్ ను ఇచ్చింది. ఇది ఆనందించాల్సిన విష‌య‌మే అయిన‌ప్ప‌టికీ ఈ సినిమా హిట్ సింహా అకౌంట్ లో కాకుండా క‌మెడియ‌న్ స‌త్య అకౌంట్ లో ప‌డింది. ఈ సినిమాలో పేరుకే హీరో శ్రీసింహా కానీ జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారంటే దానికి కార‌ణం మాత్రం స‌త్య‌, అత‌ని కామెడీనే.

మ‌త్తు వ‌ద‌ల‌రా2 స‌క్సెస్ వ‌ల్ల శ్రీ సింహాకు పెద్ద‌గా ఒరిగిందేమీ లేద‌నే కామెంట్స్ ఆడియ‌న్స్ నుంచి వినిపిస్తున్నాయి. యాక్టింగ్ ప‌రంగా సింహా చాలా బెట‌ర్ అనిపించిన‌ప్పటికీ మ‌త్తు వ‌ద‌ల‌రా2 సినిమా మొత్తాన్ని స‌త్య ఓవ‌ర్ షాడో చేసేశాడు. దీంతో సింహాకు ఆనందంతో పాటూ అయోమ‌యం కూడా క‌లుగుతుంది. సోలో హీరోగా ఏదైనా మంచి హిట్ కొడితే త‌ప్ప త‌న మార్కెట్ పెరిగే అవ‌కాశం లేదు. ఈ యంగ్ హీరో ఇక‌నైనా ఎంట‌ర్టైనింగ్ స‌బ్జెక్టుల‌ను ఎంచుకుని ముందుకెళ్తే ఆశించిన బ్రేక్ ద‌క్కే ఛాన్సుంది.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :