ASBL NSL Infratech

6 నెల‌ల డేట్స్ అడిగిన నాని డైరెక్ట‌ర్

6 నెల‌ల డేట్స్ అడిగిన నాని డైరెక్ట‌ర్

టాలీవుడ్ స్టార్ హీరోలంతా భారీ పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉంటే టైర్2 హీరోలు మేమేం త‌క్కువ కాదు అంటూ వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెడుతూ ఆడియ‌న్స్ ను అల‌రించాల‌ని చూస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నేచుర‌ల్ స్టార్ నాని గురించి. ప్ర‌స్తుతం నాని, వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో స‌రిపోదా శ‌నివారం సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా పూర్త‌వ‌గానే నాని హిట్3 సినిమాతో పాటూ ద‌స‌రా డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు. మొద‌టి సినిమా అయిన‌ప్ప‌టికీ శ్రీకాంత్ ద‌స‌రాను తెర‌కెక్కించిన విధానం ఆడియ‌న్స్ ను బాగా మెప్పించింది. నాని కూడా ద‌స‌రాతో ఊర మాస్ క్యారెక్ట‌ర్లు చేయ‌గ‌ల‌డ‌ని ప్రూవ్ చేసుకున్నాడు.

ఈసారి నానితో శ్రీకాంత్ చేయ‌బోయే సినిమా కూడా ద‌స‌రా లాంటి బ్యాక్ డ్రాప్ లోనే కాక‌పోతే పొలిటిక‌ల్ స్టోరీతో వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. నానితో ఈసారి ద‌స‌రాను మించిన సినిమా చేయాల‌ని శ్రీకాంత్ చూస్తున్ఆన‌డు. అంతేకాదు ఈ సినిమా కోసం నానిని 6 నెల‌ల బ‌ల్క్ డేట్స్ అడిగాడ‌ట శ్రీకాంత్. ఇందులో నాని పాత్ర‌తో పాటూ లుక్ కూడా డిఫ‌రెంట్ గా ఉండ‌నుంద‌ని టాక్. నాని కూడా ఈ సినిమా కోసం ముందుగా వ‌ర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇవ‌న్నీ వింటుంటే వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చే సినిమాపై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. మ‌రి నాని ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :