ASBL Koncept Ambience
facebook whatsapp X

నాని 'HIT: The 3rd Case' లో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి

నాని 'HIT: The 3rd Case' లో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి


వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని (Nani) తన 32వ మూవీ HIT: The 3rd case లో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్ ని పోషిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను (Dr Shailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్న యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది.

ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి  (Srinidhi Shetty) నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వైజాగ్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో శ్రీనిధి శెట్టి షూట్‌లో జాయిన్ అయింది. ప్రస్తుతం, టీమ్ లీడ్ పెయిర్- నాని, శ్రీనిధి శెట్టికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది.

హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్ ని పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నాని మేకోవర్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. 
     
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ డీవోపీ సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. ఈ మూవీకి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్. 

మే 1, 2025న వేసవిలో HIT 3 థియేటర్లలో విడుదల కానుంది. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :