ASBL Koncept Ambience
facebook whatsapp X

ద‌స‌రాకు రాజ‌మౌళి-మ‌హేష్ సినిమా లాంచింగ్?

ద‌స‌రాకు రాజ‌మౌళి-మ‌హేష్ సినిమా లాంచింగ్?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్ లో సినిమా రానున్న విష‌యం తెలిసిందే. ఈ సిన‌మా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంద‌నే విష‌యంలో ఇంకా క్లారిటీ రాలేదు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా ప్ర‌క‌టించి, అదే రోజున సినిమాను ప్రారంభించానల‌నుకున్నార‌ట‌.

కానీ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇంకా పూర్తి కానందున ముందుగా అనుకున్న ప్ర‌కారం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభమ‌య్యే ఛాన్స్ లేదు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లేట‌వుతున్న కార‌ణంగా షూటింగ్ ద‌స‌రాకు స్టార్ట‌య్యే అవ‌కాశాలు లేవ‌ని తెలుస్తోంది. కేఎల్ నారాయ‌ణ భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌బోతున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు.

రాజ‌మౌళి ఈ సినిమాను పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో రూపొందించ‌డానికి అన్నీ సిద్ధం చేస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌హేష్ పాన్ ఇండియా సినిమా చేసింది లేదు. ద‌స‌రా సంద‌ర్భంగా సినిమాను లాంఛ‌నంగా ప్రారంభించి వ‌చ్చే ఏడాది ఆరంభంలో సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ను స్టార్ట్ చేసి 2026 ఎండింగ్‌లో లేదా 2027 మొద‌ట్లో సినిమాను రిలీజ్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఈ సినిమా కోసం మ‌హేష్ ఫ్యాన్స్ తో పాటూ స‌గ‌లు సినీ ల‌వ‌ర్స్ కూడా ఎంత‌గానో వెయిట్ చేస్తు్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :