మహేష్ కోసం రాజమౌళి ప్లాన్ బి
ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత రాజమౌళి(Rajamouli) ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా టీమ్ తోనే మహేష్ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన పనుల్లోనే రాజమౌళి, మహేష్ బిజీగా ఉన్నారు. అవసరాన్ని బట్టి వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
అందులో భాగంగానే ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ భామను తీసుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దీనిపై క్లారిటీ రానుంది. అయితే ఈ సినిమాను జనవరి 15 తర్వాత రెగ్యులర్ షూటింగ్ కు తీసుకెళ్లాలని రాజమౌళి అనుకుంటున్నాడు. ఒకవేళ అది కుదరకపోతే రాజమౌళి దగ్గర ప్లాన్ బి కూడా ఉందట.
జనవరి 15 తర్వాత కుదరకపోతే మార్చిలో సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడట రాజమౌళి. జనవరి 15 తర్వాత మహేష్ ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ కోసం డేట్స్ ఇవ్వగలిగితే రాజమౌళి ప్లాన్ ప్రకారం సెట్స్ కు వెళ్తారట. లేదంటే మార్చి నుంచి వెళ్దామని మహేష్ కు మరో ఆప్షన్ ఇచ్చినట్లు సమాచారం. అంటే మహేష్ కు ఏదైనా వెకేషన్స్ ఉన్నా మార్చి లోపు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత మహేష్ పూర్తిగా రాజమౌళికి సరెండర్ అయిపోవాల్సి ఉంటుంది. ఒకసారి షూటింగ్ మొదలుపెడితే రాజమౌళి మహేష్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వదలడు. త్వరలోనే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఓ క్లారిటీ రానుంది.