ASBL NSL Infratech

డబుల్ ఇస్మార్ట్ పై అంచ‌నాలు పెంచేసిన స్టెప్పామార్

డబుల్ ఇస్మార్ట్ పై అంచ‌నాలు పెంచేసిన స్టెప్పామార్

రామ్ పోతినేని, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో వ‌స్తున్న డ‌బుల్ ఇస్మార్ట్ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. దీంతో ఫ్యాన్స్ ఒక్క‌సారిగా అలెర్ట్ అయిపోయారు. ఇస్మార్ట్ శంక‌ర్ కు సీక్వెల్ గా వ‌స్తోన్న ఈ సినిమాలో కావ్య థాప‌ర్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా సంజ‌య్ ద‌త్ విల‌న్ పాత్ర పోషిస్తున్నాడు. ఇస్మార్ట్ శంక‌ర్ కు సంగీతం అందించిన మ‌ణిశ‌ర్మ‌నే ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు.

ఆగ‌స్ట్ 15న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్ర‌మోష‌న్స్ ను వేగ‌వంతం చేయాల‌ని పూరీ అండ్ కో భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే డ‌బుల్ ఇస్మార్ట్ నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్ ను రిలీజ్ చేశారు. స్టెప్పామార్ అనే ఈ పాటను పక్కా మాస్ బీట్ తో కంపోజ్ చేశాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ‌. పాట ఫ‌స్ట్ టైమ్ విన్న‌ప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్ టైటిల్ సాంగ్ లా అనిపించిన‌ప్ప‌టికీ రెండింటికీ చాలా తేడా ఉంద‌న్న విష‌యం పాట వినే కొద్దీ తెలుస్తోంది.

మంచి క్యాచీ ట్యూన్ తో ఈసారి ఇస్మార్ట్ శంక‌ర్ కంటే ఎక్కువ‌గా మాస్ ప‌ల్స్ ప‌ట్టుకుని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు మ‌ణిశ‌ర్మ‌. అనురాగ్ కుల‌క‌ర్ణి, సాహితి గాత్రంతో పూరీ స్టాండ‌ర్డ్స్ కు త‌గ్గ సాహిత్యంతో స్టెప్పామార్ ఫుల్ క‌మ‌ర్షియ‌ల్ గా సాగింది. లిరిక్స్ వినేకొద్దీ ఆడియ‌న్స్‌కి ఎక్కేలా ఉన్నాయి. డ‌బుల్ ఇస్మార్ట్ పై ఉన్న అంచ‌నాల‌ను పెంచ‌డంలో స్టెప్పామార్ కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ని మాత్రం చెప్ప‌గ‌లం. ఈ సినిమా విజ‌యంపై అటు పూరీ, ఇటు రామ్ ఎంతో ధీమాగా ఉన్నారు.  

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :