బూమ్రాపై సోది ఆపండి... ఆస్ట్రేలియాకు గడ్డి పెట్టిన చాపెల్
ఆస్ట్రేలియా టూర్ ను భారత్ చాలా గ్రాండ్ గా మొదలుపెట్టింది. కివీస్ తో ఓటమి భారం నుంచి భారత జట్టు బయటకు వచ్చి... ఆస్ట్రేలియా గడ్డపై భారీ విజయం సాధించి సవాల్ చేసింది. తమను తక్కువ అంచనా వేస్తే ఫలితం ఎలా ఉంటుందో ప్రూవ్ చేసింది బూమ్రా సేన. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోయినా... ఆస్ట్రేలియాను చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ ఓటమి నుంచి కుంటి సాకులు వెతకడానికి ఆస్ట్రేలియా ప్రయత్నాలు చేస్తోంది. బూమ్రా బౌలింగ్ యాక్షన్ పై ఆస్ట్రేలియా ఆటగాళ్ళు కామెంట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అతని యాక్షన్ ఇల్లీగల్ అంటూ ఆస్ట్రేలియా ఆటగాళ్ళు కామెంట్స్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ ఛాపెల్ కీలక వ్యాఖ్యలు చేసాడు. భారత్‌తో 295 పరుగుల తేడాతో ఓడిన తర్వాత ఆస్ట్రేలియన్ టాప్ ఆర్డర్ వైఫల్యం ఆతిథ్య జట్టుకు పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోందని అతను అభిప్రాయపడ్డాడు. బుమ్రా నేతృత్వంలోని భారత బౌలర్లు మరింత పదునుగా, మరింత భయంకరంగా కనిపించారన్నాడు. అతన్ని ఎదుర్కొనే మార్గాలు అన్వేషించండి... అంతే గాని బుమ్రా యాక్షన్ ను ప్రశ్నించే అర్ధంలేని పనులు వద్దని సూచించాడు.
అతని యాక్షన్ చాలా స్పెషల్... ఇది స్పష్టంగా అర్ధమవుతుంది. మీరు చేసే కామెంట్స్ ఒక చాంపియన్ ప్లేయర్ ను కించపరచడమే అని అభిప్రాయపడ్డాడు. బలవంతమైన విషయాలను ఎదుటి వాళ్ళపై రుద్దే ముందు మీరు ఏం చేయాలో ఆలోచించండి అంటూ ఛాపెల్ తమ జట్టుకు సూచించాడు. ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌లో చాపెల్ రాసిన ఓ కాలమ్ లో ఈ వ్యాఖ్యలు చేసాడు. ఇక ఆ జట్టు కీలక ఆటగాడు లబుషేన్ ఆటపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. అతను జూలై 2023 నుండి సెంచరీ చేయలేదని... ఆ ఒత్తిడిలో ఉన్నాడు అంటూ కామెంట్ చేసాడు. అతని చివరి 16 ఇన్నింగ్స్‌లలో కేవలం 330 పరుగుల వెనుకబడ్డాడు అని... తిరిగి ఫాంలోకి రావాలని... క్రీజ్ లో నిలబడటంతో పాటు పరుగులు చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించాడు.