లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గెలవాలని న్యూజెర్సీలో ‘సుదర్శన హోమం’
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఓఎఫ్‌బీజేపీ-యూఎస్ఏ అధ్యక్షులు డాక్టర్ అడపా ప్రసాద్ నేతృత్వంలో అమెరికాలోని న్యూజెర్సీలో ‘సుదర్శన హోమం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓఎఫ్‌బీజేపీ వాలంటీర్లంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేశారు. ఎడిసన్‌లోని సాయి దత్త పీఠంలో ఉన్న శ్రీ శివ విష్ణు ఆలయంలో ఈ హోమం చేశారు. వందలాది మంది బీజేపీ మద్దతుదారులు ఈ హోమంలో పాల్గొని, ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రముఖులు కృష్ణా రెడ్డి, చరణ్ సింగ్, కల్పన శుక్లా అందరూ కూడా భగవంతుని ఆశీస్సులతో ప్రధాని మోదీ మరోసారి ప్రధాన మంత్రి అవుతారని అన్నారు. యువత అందరూ కూడా మోదీకి మద్దతుగా నిలుస్తున్నారని దీప్ భట్చెప్పారు. న్యూజెర్సీలో ఉండే భారత కమ్యూనిటీ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. కమ్యూనిటీ లీడర్లతోపాటు పద్మశ్రీ డాక్టర్ సుధీర్ పరేఖ్, జయేష్ పటేల్, కె. నరూల, మా రాజ్యలక్ష్మి, గుంజన్ మిశ్రా, హ్యారీ సేథి, మధుకర్ రెడ్డి, గనేష్ ఆర్ గోవిందరాజ్, శ్రీకాంత్ రెడ్డి, సనీల్, గోపి తదితర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.