ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆ డైరెక్ట‌ర్ తో సుధీర్ బాబు సినిమా

ఆ డైరెక్ట‌ర్ తో సుధీర్ బాబు సినిమా

న‌టుడిగా ఎన్నో సినిమాలు చేసిన రాహుల్ ర‌వీంద్ర‌న్(Rahul Ravindran), చి.ల‌.సౌ(Chi la Sow) సినిమాతో డైరెక్ట‌ర్ గా మారి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. సెన్సిటివ్ స్టోరీని హృద్యంగా చెప్పి మంచి ప్ర‌శంస‌లందుకున్నాడు. కానీ ఆ త‌ర్వాత నాగార్జున(Nagarjuna)తో చేసిన మ‌న్మ‌థుడు2(Manmadhudu2) మాత్రం ఘోర‌మైన డిజాస్ట‌ర్ గా మిగిలింది. మ‌న్మ‌థుడు2 త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాహుల్ ఇప్పుడో లేడీ ఓరియెంటెడ్ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు.

సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రైన ర‌ష్మిక మంద‌న్నా(Rashmika Mandanna) ప్ర‌ధాన పాత్రలో చేస్తున్న ఈ సినిమాకు గ‌ర్ల్ ఫ్రెండ్(Girl Friend) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. గీతా ఆర్ట్స్(Geetha Arts) ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాక‌ముందే రాహుల్ మ‌రో సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా రాహుల్ ర‌వీంద్ర‌న్ డైరెక్ట‌ర్ గా ఓ సినిమా రానుంది.

సుధీర్ బాబు తాజా సినిమా మా నాన్న సూప‌ర్ హీరో(Maa Nanna Super Hero) ప్ర‌మోష‌న్స్ లో భాగంగా స్వ‌యంగా సుధీర్ బాబే ఈ విష‌యాన్ని వెల్లండించాడు. ప్ర‌స్తుతం జ‌టాధ‌ర(Jatadhara) అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సుధీర్, ఆ త‌ర్వాత రాహుల్ రవీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. సెన్సిటివ్ సినిమాలు తీసే రాహుల్, సినిమా సినిమాకు వైవిధ్యం చూపించే సుధీర్ కాంబోలో ఎలాంటి సినిమా వ‌స్తుందనేది అంద‌రికీ ఆస‌క్తిక‌రంగా మారింది. నెక్ట్స్ ఇయ‌ర్ సెకండాఫ్ లో ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :