ASBL Koncept Ambience
facebook whatsapp X

సుహాస్ ల‌క్ మామూలుగా లేదుగా!

సుహాస్ ల‌క్ మామూలుగా లేదుగా!

రెగ్యుల‌ర్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు చేస్తున్న సుహాస్ నుంచి ఈ ఇయ‌ర్ ఎక్కువ సినిమాలే వ‌స్తున్నాయి. త‌న తాజా సినిమా జ‌న‌క అయితే గ‌న‌క సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ కానుంది. ల‌క్కీ భాస్క‌ర్ ఆ డేట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో వెంట‌నే సుహాస్ ఆ డేట్ ను ప‌ట్టేసుకున్నాడు. గ‌తేడాది దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి రిలీజైన‌ బ‌ల‌గం బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఇప్పుడు మ‌రోసారి కంటెంట్, కాన్సెప్ట్ ని న‌మ్మ‌కుని దిల్ రాజు జ‌న‌క అయితే గ‌న‌క‌ ని తీసుకొస్తున్నాడు.

ఈ సినిమాపై దిల్ రాజు స్పెష‌ల్ కేర్ తీసుకోబోతున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్. యూత్, ఫ్యామిలీని ఇంప్రెస్ చేసే అంశాలు ఇందులో బాగా ఉండ‌టంతో థియేట‌ర్ల విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని ప్రీమియం స్క్రీన్స్ వ‌చ్చేలా చూస్తున్నాడ‌ట‌. దీనికి రెండ్రోజుల ముందు విజ‌య్ గోట్ రిలీజ‌వుతుంది. తెలుగులో కూడా ఈ సినిమా గ్రాండ్ గానే రిలీజ్ కానుంది.

విజ‌య్ లాంటి పెద్ద హీరో సినిమాను త‌ట్టుకుని నిల‌బ‌డటం సుహాస్ ఒక్క‌డి వ‌ల్ల కాదు. కానీ దీని వెనుక దిల్ రాజు ఉన్నాడు కాబ‌ట్టి క‌థ మొత్తం ఆయ‌నే న‌డిపిస్తాడు. సినిమాకు మంచి టాక్ వ‌స్తే చాలు, దాన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ ఎలా చేయాలో ఆయ‌న‌కు చాలా బాగా తెలుసు. వేరే ఏ నిర్మాత అయినా స‌రే విజ‌య్ సినిమాకు ఎదురెళ్లే డేర్ చేయ‌డు కానీ దిల్ రాజు లెక్క‌లు వేరుగా ఉంటాయ‌న్న విష‌యం తెలిసిందే. ఈ యాంగిల్ లో చూసుకుంటే సుహాస్ బూరెల బుట్ట‌లో ప‌డ్డ‌ట్టే.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :