ASBL Koncept Ambience
facebook whatsapp X

పుష్ప‌2 ముచ్చ‌ట్లు చెప్పిన హీరో, డైరెక్ట‌ర్

పుష్ప‌2 ముచ్చ‌ట్లు చెప్పిన హీరో, డైరెక్ట‌ర్

సుకుమార్ భార్య త‌బిత నిర్మాణ భాగస్వామ్యంలో వ‌స్తోన్న మారుతిన‌గర్ సుబ్ర‌హ్మ‌ణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుకుమార్, అల్లు అర్జున్ చీఫ్ గెస్టులుగా వ‌చ్చిన సంగతి తెలిసిందే. అయితే పేరుకే రావు ర‌మేష్ సినిమా ఈవెంట్ కానీ మ్యాట‌ర్ మొత్తం పుష్ప2 గురించే జ‌రిగింది. ప్ర‌స్తుతం పుష్ప‌2 సినిమాను పూర్తి చేయ‌డానికి సుకుమార్ మీద ఎంత ప్రెజ‌ర్ ఉందో ఆయ‌న మాట‌ల్లో తెలుస్తోంది.

ఈవెంట్ లో భాగంగా సుకుమార్ మాట్లాడటం మొద‌లుపెట్టే ముందు బ‌న్నీ ఫ్యాన్స్ బాగా అరిచారు. పుష్ప‌2 క్లైమాక్స్ తీస్తున్నామ‌ని, ఇప్పుడు త‌న‌ను డిస్ట‌ర్బ్ చేస్తే ఇబ్బంది ప‌డాల‌ని చెప్ప‌డం చూస్తే ఎంత ప్రెజ‌ర్ ఉందో అర్థ‌మ‌వుతుంది. అంతేకాదు ఇది పుష్ప‌2తో ఆగ‌ద‌ని, ఇంకో అయిదారు భాగాలు కూడా తీస్తామ‌ని సుకుమార్ స‌ర‌దాగా అన‌డంతో ప‌క్క‌నే ఉన్న బ‌న్నీ షాకింగ్ ఎక్స్‌ప్రెష‌న్స్ పెట్టాడు.

అల్లు అర్జున్ కూడా త‌న స్పీచ్ లో డిసెంబ‌ర్ 6న అస్స‌లు త‌గ్గేదేలేఅంటూ స్పెష‌ల్ గా పుష్ప‌2 కు ఎలివేష‌న్స్ ఇవ్వ‌డం బ‌న్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. మామూలుగా త‌న సినిమాల గురించి రిలీజ్ కు ముందు మాట్లాడ‌టానికి భ‌య‌ప‌డ‌తాన‌ని, కానీ ఈసారి అలా కాద‌ని చెప్పాడు. అంతేకాదు ఇక‌పై ఎక్కువ వేగంగా సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తాన‌ని చెప్ప‌డంతో పుష్ప లేట్ కు బ‌న్నీ ఎంతో నిరాశ చెందాడ‌ని తెలుస్తోంది. మొత్తానికి అనుకోకుండా పుష్ప‌2 గురించి బాగానే అప్డేట్స్ బ‌య‌టికొచ్చాయి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :