ASBL NSL Infratech
facebook whatsapp X

ఎటూ తేల్చుకోలేక‌పోతున్న సుకుమార్

ఎటూ తేల్చుకోలేక‌పోతున్న సుకుమార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా పుష్ప‌2. ఆగ‌స్ట్ 15న ఈ సినిమా రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ పూర్తి కాక‌పోవ‌డంతో డిసెంబ‌ర్ 6కి రిలీజ్ ను వాయిదా వేశారు. రూ.300 కోట్ల బ‌డ్జెట్ తో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తోంది. పుష్ప సినిమాకు నేష‌న‌ల్ అవార్డు రావ‌డంతో బ‌న్నీ కూడా పుష్ప‌2ని చాలా ప్రిస్టేజ్ గా తీసుకుని చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే సుకుమార్ కూడా పుష్ప‌2ని మ‌రింత గ్రాండియ‌ర్ గా తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడు. పుష్ప సినిమాలో స‌మంత‌తో ఐటెం సాంగ్ చేయించి దాన్ని మంచి హిట్ చేసిన సుకుమార్ ఇప్పుడు పుష్ప‌2లోని స్పెష‌ల్ సాంగ్ కోసం నానా తిప్ప‌లు ప‌డుతున్నాడు. త‌న వంతు బాధ్య‌త‌గా దేవీ శ్రీ ప్ర‌సాద్ ఇప్ప‌టికే పుష్ప2 కోసం మంచి ఐటెం సాంగ్ ను రెడీ చేసి ఇచ్చాడు.

కానీ సుకుమార్ ఆ సాంగ్ ను ఏ హీరోయిన్ తో చేయించాల‌నే దానిపై ఓ నిర్ణ‌యానికి రాక‌పోవ‌డం వ‌ల్లే లేట‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ముందుగా ఈ సాంగ్ కోసం శ్రీలీల‌ను తీసుకోవాల‌నుకున్నార‌ట. కానీ శ్రీలీలకు ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌తో క్రేజ్ త‌గ్గ‌డంతో ఆమెను వ‌ద్ద‌నుకున్నాడ‌ట‌. ఆ త‌ర్వాత యానిమ‌ల్ భామ త్రిప్తిని అనుకున్నారు కానీ ఆమెకు డ్యాన్స్ రాద‌ని ప‌క్క‌న‌పెట్టార‌ట‌. త‌ర్వాత జాన్వీ క‌పూర్ ను అనుకున్నారు కానీ రూ.4 కోట్లు రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేయ‌డంతో వ‌ద్ద‌ని వెనుక‌డుగేశారు. మ‌రి సుకుమార్ ఫైన‌ల్ గా ఆ స్పెష‌ల్ సాంగ్ కోసం ఏ హీరోయిన్ ను ఫిక్స్ చేస్తాడో చూడాలి.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :