ASBL Koncept Ambience
facebook whatsapp X

పుష్ప‌2 లో సుకుమార్ కు అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌

పుష్ప‌2 లో సుకుమార్ కు అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న పుష్ప‌2 షూటింగ్ అనుకున్న ప్ర‌కార‌మే జ‌రుగుతున్న‌ప్పటికీ కొన్ని బ్రేకులు మాత్రం త‌ప్ప‌ట్లేదు. మొన్నా మ‌ధ్య ర‌ష్మిక కు జ‌రిగిన ప్ర‌మాదం వ‌ల్ల ఆమె పార్ట్ షూటింగ్ ను పెండింగ్ ఉంచిన టీమ్ ఇప్పుడా షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ ముప్పాతిక శాతం వ‌ర‌కు పూర్తైంది.

ఈ సారి ఎట్టి ప‌రిస్థితుల్లో చెప్పిన డేట్ కే సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ చాలా గ‌ట్టిగా డిసైడ‌య్యారు. అయితే సుకుమార్ మ‌న‌సులో పుష్ప‌2 ఐటెం సాంగ్ విష‌యంలో మాత్రం ఆందోళ‌న అలాగే ఉంది. ఇంకా ఆ సాంగ్ ను షూట్ చేయ‌లేదు. అంతేకాదు ఆ సాంగ్ ను ఎవరితో చేయించాల‌నే ఆలోచ‌న‌కు ఇంకా శుభం కార్డు ప‌డ‌లేద‌ని తెలుస్తోంది.

దిశా ప‌టానీ, కియారా అద్వానీని అనుకున్నారు కానీ వారి డేట్స్, రెమ్యూన‌రేష‌న్ వ‌ల్ల ముందుకు వెళ్ల‌డం లేదు. ఫైన‌ల్ గా ఈ సాంగ్ ఎవ‌రు చేస్తార‌నేది మాత్రం ఇప్ప‌టికీ అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గానే మిగిలింది. రిలీజ్ కు మ‌రో మూడున్న‌ర నెల‌లు మాత్ర‌మే ఉండ‌టంతో పుష్ప‌2 టీమ్ పరుగులు పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :