ASBL Koncept Ambience
facebook whatsapp X

స‌మ్మ‌ర్ సినిమాల్లో గెలిచేదెవ‌రు?

స‌మ్మ‌ర్ సినిమాల్లో గెలిచేదెవ‌రు?

సంక్రాంతి(Sankranthi) కాకుండా టాలీవుడ్ లో పెద్ద సీజ‌న్ అంటే స‌మ్మ‌ర్‌నే. నెక్ట్స్ స‌మ్మ‌ర్ కు ఎన్ని సినిమాలు రిలీజ‌వుతున్నాయి? ఎంత మంది హీరోలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డ‌తారంటే ఈసారి కాంపిటీష‌న్ గ‌ట్టిగానే ఉండ‌నుంది. మార్చి 28న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు(Harihara veeramallu) రిలీజ‌వుతుంది. అదే రోజున విజ‌య్ దేవ‌ర‌కొండ12(VD12) రిలీజ్ ఫిక్స్ అయింది.

ఇదే నెల‌లో మెగాస్టార్ చిరంజీవి(Chiranjevi) విశ్వంభ‌ర(Viswambhara) కూడా పోటీలో ఉంది. నితిన్(nithin) త‌మ్ముడు(Thammudu) కూడా ఫిబ్ర‌వ‌రి లో వ‌చ్చే ఛాన్సుంది. ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ కాక‌పోతే మార్చిలో రిలీజవుతుంది. మిగిలిన సినిమాలు ప‌క్క‌న‌పెడితే చిరూ(Chiru), ప‌వ‌న్(Pawan) సినిమాలొస్తే థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడ‌టం ఖాయం. ఆ త‌ర్వాత ఏప్రిల్ లో రాజా సాబ్‌(Raja Saab)లో ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య రాజా సాబ్ రిలీజ్ కాబోతుంది.

ఏప్రిల్ 18న తేజ స‌జ్జ(Teja Sajja) మిరాయ్(miraai) రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే రిలీజైన ప్రమోష‌న‌ల్ చిత్రాల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. హిట్ టాక్ వ‌చ్చిందంటే హ‌నుమాన్(hanuman) క‌లెక్ష‌న్స్ ను తిర‌గ‌రాసే స‌త్తా ఉన్న సినిమా ఇది. మంచు విష్ణు న‌టిస్త‌న్న క‌న్న‌ప్ప(Kannappa) ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. వంద‌ల కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప‌లువురు స్టార్లు న‌టిస్తున్నారు. య‌ష్(Yash) న‌టిస్తున్న టాక్సిక్(Toxic) కూడా అదే నెల‌లో రిలీజ్ కానుంది. వీటితో పాటూ కాంతార(kanthara) సీక్వెల్, హిట్3(Hit3) లాంటి సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. క‌మ‌ల్ హాస‌న్ (Kamal Hassan) థ‌గ్ లైఫ్(Thug Life) కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ కానుంది. మ‌రి వీటిలో ఏ సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తాయో చూడాలి.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :