ASBL NSL Infratech
facebook whatsapp X

సుందర్‌ పిచాయ్‌ మరో అరుదైన ఘనత... ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి

సుందర్‌ పిచాయ్‌ మరో అరుదైన ఘనత... ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి

గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సంస్థల సీఈఓ సుందర్‌ పిచాయ్‌ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. భారత్‌లోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్‌ వీకే తివారీ, విద్యాసంస్థకు చెందిన ఇతర ప్రతినిధులు ఆయనకు ఆనరరీ డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ను అందించారు.ఈ సందర్భంగా సుందర్‌ పిచాయ్‌  స్పందించారు. నా పూర్వ విద్యా సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి  గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం చాలా గర్వంగా ఉంది. నేను డాక్టరేట్‌ పొందాలని నా తల్లిదండ్రులు ఎప్పుడూ ఆశ పడేవారు. ఐఐటీలో నేను నేర్చుకున్న విద్య, సాంకేతికతే ఈ రోజు నన్ను గూగుల్‌ వరకు తీసుకొచ్చింది. టెక్నాలజీని మరింత ఎక్కువ మందికి అందించే స్థాయికి చేర్చింది. ఆ విద్యాసంస్థలో నాకు సమయం గడిపే అవకాశం వచ్చినందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటా అని అన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :