ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆ హీరో కొడుకు డైరెక్ష‌న్‌లో సందీప్ కిష‌న్?

ఆ హీరో కొడుకు డైరెక్ష‌న్‌లో సందీప్ కిష‌న్?

త‌మిళ స్టార్ హీరో కొడుకు జేస‌న్ విజ‌య్ యాక్టింగ్ కంటే డైరెక్ష‌న్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ముందు డైరెక్ట‌ర్ గా ప్రూవ్ చేసుకున్న త‌ర్వాత హీరోగా ట్రై చేస్తాడో లేక పూర్తిగా డైరెక్ట‌ర్ గానే సెటిలవుతాడా అన్న‌ది తెలియాల్సి ఉంది. గోట్ సినిమాతో పాటూ మ‌రో సినిమా చేసి ఫుల్ టైమ్ రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌ని డిసైడ్ అయిన విజ‌య్ ఫ్యాన్స్ నిరాశ‌ను తగ్గించాలంటే జేస‌న్ హీరోగానే ఎంట్రీ ఇవ్వాలి.

కానీ జేస‌న్ కు డైరెక్ష‌న్ మీద ఇంట్రెస్ట్ ఉండ‌టంతో ఫ్యాన్స్ లో అయోమ‌యం నెల‌కొంది. ప్ర‌స్తుతం జేస‌న్ ఓ సినిమా స్క్రిప్ట్ ను రాసుకుని ఆ వ‌ర్క్స్ ను పూర్తి చేయడానికి చూస్తున్న‌ట్లు స‌మాచారం. లైకా ప్రొడ‌క్ష‌న్స్ భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మించ‌డానికి రెడీగా ఉంద‌ట‌. ఈ సినిమాలో హీరోగా సందీప్ కిష‌న్ ఆల్మోస్ట్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్లు కోలీవుడ్ మీడియా వ‌ర్గాలంటున్నాయి.

రీసెంట్ గా రాయ‌న్ సినిమాతో త‌మిళ ఆడియ‌న్స్ కు బాగా ద‌గ్గ‌రైన సందీప్ కిష‌న్ కు అక్క‌డి నుంచి బాగానే ఆఫ‌ర్లొస్తున్నాయి. మా నగ‌రం నుంచి కెప్టెన్ మిల్ల‌ర్ వ‌ర‌కు కోలీవుడ్ ఆడియ‌న్స్ కు ట‌చ్ లోనే ఉన్న‌ప్పటికీ రాయ‌న్ సినిమాతో సందీప్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వేరు. త‌న క‌థ‌కు సందీప్ అయితేనే న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని జేస‌న్ భావిస్తున్నాడ‌ట‌. ఇంకా అధికారికంగా ఎలాంటి క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు కానీ జేస‌న్ డెబ్యూ డైరెక్ట‌ర్ మూవీ కోసం అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :