ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆ ఎన్నికల్లో అంతరిక్షం నుంచే... ఓటు వేయనున్న సునీతా విలియమ్స్‌

ఆ ఎన్నికల్లో అంతరిక్షం నుంచే... ఓటు వేయనున్న సునీతా విలియమ్స్‌

బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ తాజాగా  ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సంరద్భంగా అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఆ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సునీత, విల్‌మోర్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఐఎస్‌ఎస్‌ నుంచే ఓటు వేయాలనుకుంటున్నట్లు వీరిద్దరు తెలిపారు. బ్యాలెట్‌ కోసం మా అభ్యర్థనను కిందకు పంపించాం. అమెరికా పౌరులుగా ఓటు హక్కు  వినియోగించుకోవడం మా కీలక కర్తవ్యం. మా విధిని నెరవేర్చుకునేందుకు నాసా సహకరిస్తుంది అని విల్‌మోర్‌ వెల్లడిరచారు. అనంతరం సునీత మాట్లాడుతూ ఓటు మా బాధ్యత. అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నాం అని ఆనందం వ్యక్తం చేశారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :