ASBL Koncept Ambience
facebook whatsapp X

శ్రీవిష్ణు హీరోయిన్ కు బంప‌రాఫ‌ర్

శ్రీవిష్ణు హీరోయిన్ కు బంప‌రాఫ‌ర్

గ‌తేడాది రిలీజైన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న ఎంత పెద్ద హిట్లో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంచ‌నాల్లేకుండా వ‌చ్చిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా తో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన రెబా మోనికా జాన్ త‌న అందం, అభిన‌యంతో ఆడియ‌న్స్ ను ఆకట్టుకుంది. టాలీవుడ్ లో మ‌ళ్లీ శ్రీవిష్ణుతో క‌లిసి ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ చేస్తుంది. దీంతో పాటూ త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో కూడా న‌టిస్తోంది మోనికా. ఇదిలా ఉంటే అమ్మ‌డికి ఇప్పుడో బంప‌రాఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్- లోకేష్ క‌న‌గ‌రాజ్ కాంబినేష‌న్ లో కూలీ అనే సినిమా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా హైద‌రాబాద్ లో మొద‌లైంది.

ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం మోనికా జాన్ ను సంప్ర‌దించిన‌ట్లు టాక్. ఇంకా అఫీషియ‌ల్ గా క‌న్ఫ‌ర్మ్ కాలేదు కానీ లీకైన సోర్స్ ను చూస్తుంటే నిజ‌మ‌య్యే ఛాన్సులే ఎక్కువ‌గా ఉన్నాయి. అలా అని ఈ సినిమాలో రజినీకి జోడీగా న‌టించ‌డం లేదు. సినిమాలో ఓ యంగ్ హీరోకు జంట‌గా, స్టోరీని మ‌లుపు తిప్పే పాత్ర‌ను అమ్మ‌డికి లోకేష్ ఆఫ‌ర్ చేశాడ‌ట‌. ఇది నిజ‌మైతే మాత్రం మోనికాకి జాక్ పాట్ త‌గిలిన‌ట్టే. ఈ విష‌యంలో క్లారిటీ రావాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :