ASBL Koncept Ambience
facebook whatsapp X

శ్వాగ్ టీమ్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా

శ్వాగ్ టీమ్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా

ఏ ద‌ర్శ‌క నిర్మాతైనా, ఏ హీరో అయినా స‌రే తాము మంచి సినిమా తీశామ‌నే భావిస్తారు. అది నిజ‌మ‌వుతుందా లేదా అనేది సినిమా రిలీజ‌య్యాక ఆడియ‌న్స్ ఇచ్చే తీర్పు మీద ఆధార‌ప‌డి ఉంటుంది. సినిమాపై త‌మ న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేయ‌డానికి ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ధతిని ఫాలో అవుతుంటారు. రాజరాజ చోర(RajaRaja Chora) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీవిష్ణు(Sree Vishnu)   ఆ సినిమాపై త‌న కాన్ఫిడెన్స్‌ను మాటల్లో చూపిస్తూ అంద‌రూ ఏదో అనుకున్నారు కానీ అత‌ను చెప్పిన మాట‌లు అక్ష‌రాలా నిజ‌మయ్యాయి.

ఇక అస‌లు విష‌యానికొస్తే శ్రీవిష్ణు హీరోగా హ‌సిత్ గోలి(Haisth Goli) ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ(People Media Factory) నిర్మించిన శ్వాగ్(Swag) ఎల్లుండి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రీసెంట్ గా జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తీ ఒక్క‌రూ శ్వాగ్ గురించి చెప్పిన మాట‌లు వింటుంటే ఇదేమీ ఆషామాషీ సినిమా కాద‌ని అర్థ‌మ‌వుతుంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్ట‌ర్ హ‌సిత్ గోలి ఈ సినిమాపై ఎంతో న‌మ్మ‌కాన్ని క‌న‌బ‌రిచాడు. శ్వాగ్ 2024లోనే బెస్ట్ ఇంట‌ర్వెల్, బెస్ట్ క్లైమాక్స్ క‌లిగిన సినిమా అవుతుంద‌ని, గ‌త కొన్నేళ్ల‌లోనే కాదు రాబోయే ఏళ్ల‌లో కూడా ఇలాంటి సినిమా రాలేద‌ని ధీమా వ్య‌క్తం చేశాడు. శ్రీవిష్ణు కూడా శ్వాగ్ పై అంతే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తూ ఈ సినిమా తెలుగు వాళ్లు గ‌ర్వ‌ప‌డేలా ఉంటుంద‌ని హామీ ఇచ్చాడు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే శ్వాగ్ సినిమాను త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేదు.    

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :