ASBL Koncept Ambience
facebook whatsapp X

మిన్నంటిన TAGB దసరా దీపావళీ వేడుకలు

మిన్నంటిన TAGB దసరా దీపావళీ వేడుకలు

కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు అందరికి ధన్యవాదాలు!!

దీపావళీ వేడుకలు అక్టోబర్ 13న బెల్లింగ్ హం హైస్కూల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. పూల ద్వారం ఆహుతులకి ఆహ్వానం పలుకగా, ఎన్నో అంగడులు, పిల్లల సందళ్ళతో కార్యక్రమం ఒంటిగంటకి మొదలైయ్యి నిరాఘాటంగా నృత్యాలు, పాటలు, వాద్య ప్రదర్శన, నాటక ప్రదర్శన, ఫ్యాషన్ షో తదితర వైవిధ్యభరితమైన కార్యక్రమాలతో అందరిని అలరించి బతుకమ్మ వేడుకలతో దసరా పండుగ బోస్టన్ ముంగిట్లోకి సరదాగా జరిగింది.

గాయకుడు మనో మరియు సత్యా యామిని "ప్రియా ప్రియతమా రాగాలు" సంగీతవిభావరి శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసింది అంటే అతిసయోక్తి కాదు. చక్కని మెలోడీలు, ఆపాతమధురాలు, పెప్పీ పాటలు నవరసాలు మేళవించిన పాటాలే కాక చక్కని పద్యాలతో ఆ కార్యక్రమం అందరికి ఒక చక్కని జ్ఙాపకంలా నిలిచిపోతుంది.

ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్లు S4 మీడియా మరియు క్లాసిక్ ఈవెంట్ లకు ధన్యవాదాలు . గాయకుడు మనో గారు మొదటిసారి బొస్టన్ రావడం మరియు ఎల్.ఈ.డి స్క్రీన్ మన టీ.ఏ.జీ.బి లో మొదటిసారిగా వాడడం ముదావహం. ఈ ఆలోచనలు అన్ని కార్యరూపం దాల్చడనికి అహర్నిశలు సహకరించి అందరికి ప్రత్యేకంగా కొశాధికారి దీప్తి కొరిపల్లి కి ధన్యవాదాలు.

నలభై యేళ్ళ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న మన తెలుగు సంఘం మరెన్నో పుట్టిన రోజులు ఇలాగే మన తరంతో - మన భావితరాలతో కూడా జరుపుకొవాలని, కొత్త కొత్త కార్యక్రమాలు ముందుకు తీసుకొని రావడనికి అందరు సహకరించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, భాషా వేదికలు, ఇష్టాగోష్టులు, పాటల పోటీ, వేసవి స్నేహోత్సవం, పాటా మాటా ఓ తెలుగాట; కార్యక్రమం ఎదైనా మీ అందరు పాల్గొనడం దానిని విజయవంతం చేయడమే మాకు ఉత్సాహాన్ని ఇంకా మంచి కార్యక్రమాలు చెయ్యలి అన్న ప్రేరణని కలుగజేస్తుంది అని ప్రెసిడెంట్ శ్రీమతి దీప్తీ గోరా అన్నారు. దీప్తీ గోరా సారధ్యంలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీనివాస్ గొంది, కార్యదర్శి శ్రీకాంత్ గొమట్టం, కొశాధికారి దీప్తి కొరిపల్లి, కల్చరల్ సెక్రటరి జగదీష్ చిన్నం, బోర్డ్ ఆఫ్ ట్రస్టిస్, వాలంటీర్ల సహకారంతో ఎంతో విజయవంతంగా ఈ కర్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రాంగణాన్ని పండుగ వాతావరణంతో, సంప్రదాయం-అధునికత: పూల ద్వారం -ఎల్.ఈ.డి స్క్రీన్ డిస్ప్లే లతో మేళవించి చేసిన అలకరణలు చాల చక్కగా వున్నాయని ఆహుతులు ఆనందం వ్యక్తం చేసారు, ఈ ఏర్పా టు క్లాసిక్ ఈవెంట్ వారు చేసారు.

ఆ నాటి సాయంత్రం అందరికి ఒక చక్కని అనుభూతిగా మిగిని పోతుంది.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :