వరద భాదితుల కోసం న్యూయార్క్ లో తానా ఆటపాట
ఉభయ తెలుగు రాష్ట్రాలలో వరద సృష్టించిన విలయానికి నష్టపోయిన బాధితులకు తానా అండగా నిలిచింది. వేలాదిగా ప్రాణ నష్టం, ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులు కావడం, లక్షలాది ఎకరాలలో పంట నష్టం, వీటన్నిటికీ చలించిన "తానా'- సేన మానవతా దృక్పధం తో బాధిత ప్రాంతాలలో నిత్యావసర రేషన్ కిట్లను అందించింది. అలాగే తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అమెరికా లో కూడా దాతల నుంచి విరాళాలు సేకరించి బాధితులకు వివిధ రకాలుగా తోడ్పడుతోంది. ఈ విరాళాల సేకరణ కార్యక్రమం లో భాగంగా తానా సెప్టెంబర్ 15 వతేదీన న్యూ యార్కులో ప్రముఖ యాంకర్ సుమతో "ఆట పాట' కార్యక్రమం నిర్వహించింది. నటి, యాంకర్ సుమ కనకాల సమయస్ఫూర్తి, హాస్య సంభాషణలను మేళవించి సభాకార్య క్రమాన్ని అలరించారు, ప్రతీ టేబుల్ వద్దకు వెళ్ళి ఆహూతులను ఆట పాటల్లో ముంచెత్తుతూ, ఉర్రూతలూగించారు. దాదాపు 200 కి పైగా దాతలు హాజరైన ఈ కార్యక్రమం ఉభయ రాష్ట్రాలలోని తెలుగు వారికి వరద సహాయాన్ని అందించడానికి తమవంతుగా ఉదారంగా విరాళాలు అందించారు. మానవతా దృక్పధం తో తానా చేస్తున్న కృషిని న్యూయార్క్ ప్రముఖులు ప్రశంసించారు.
జయ తాళ్ళూరి, మోహన్ బాధే, కల్పన వనం, రావు వోలెటి, దేవ రత్నం, కృష్ణ గుజవర్తి, పూర్ణ అట్లూరి, కృష్ణ మద్దిపట్ల, తిరుమల రావు తిపిర్నేని,కిషోర్ కుంచం , శ్రీదేవి భూమి, జగ్గా అల్లూరి బాధితుల కష్టాల వివరాలు విని స్పందించి విరాళాలు అందించారు.
వచ్చిన పదిలక్షల రూపాయలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి అందజేశారు.
తానా సంస్థ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ దీపికా సమ్మెట, శిరీష తూనుగుంట్ల, సుమంత్ రామిశెట్టి సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు డా. నోరి దత్తాత్రేయ,నెహ్రూ చెరుకుపల్లి,
టి.ఎల్.సి.ఏ,ఎన్.వై.టీ.టి.ఏ, టీ.టీ.ఏ,ఎం.ఏ.టీ.ఏ సంస్థల కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.
శ్రీలక్ష్మి కులకర్ణి వ్యాఖ్యాత గా వ్యవహరించారు.
సత్య చల్లపల్లి, జయప్రకాష్ ఇంజపూరి, శైలజా చల్లపల్లి, విజయ్ లోతుగడ్డ, సాయి దేవినేని, మురళీ సహకారం అందించారు. తానా కార్యవర్గం రావు వోలెటి, దిలీప్ ముసునూరు, శ్రీనివాస్, యమున, శైలజ శంకర్ సహకరించారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, వరద బాధితులకు ఇతోధికంగా సహాయం చేయడంలో దోహదపడిన న్యూయార్క్ కార్యావర్గానికి తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, పూర్వాధ్యక్షులు జయ తాళ్ళూరి, వైస్ ప్రెసిడెంట్ నరేన్ కొడాలి, పూర్వాధ్యక్షులు అంజయ్య లావు లు అభినందనలు తెలిపారు.