ASBL Koncept Ambience
facebook whatsapp X

తానా ఫౌండేషన్‌ సహాయం.... 60 బాలికలకు సైకిళ్ళ పంపిణీ

తానా ఫౌండేషన్‌ సహాయం.... 60 బాలికలకు సైకిళ్ళ పంపిణీ

స్కూళ్ళ బెంచీల మరమ్మతులకు 2 లక్షల విరాళం 

ఖమ్మం శాంతి నగర్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదరణ పథకం కింద బాలికలకు సైకిళ్ళ పంపిణీ జరిగింది.  పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ డాన్‌ బస్కోఈ కార్యక్రమానికి సునీత కాట్రగడ్డ స్మారకార్థం రాలేకి చెందిన ప్రశాంత్‌ కాట్రగడ్డ డోనర్‌ గా వ్యవహరించారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి ఆధ్వర్యంలో కో ఆర్డినేటర్‌ భక్త బల్లా నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శశికాంత్‌ వల్లేపల్లి మాట్లాడుతూ, ఫౌండేషన్‌ తరపున వివిధ కార్యక్రమాలను చేస్తున్నామని, ఆదరణ పథకం కింద ప్రస్తుతం 60మంది బాలికలకు సైకిళ్ళను అందజేస్తున్నామని చెప్పారు. స్థానిక జలగం నగర్‌ ఉన్నత పాఠశాల పరిధిలో 200 మంది వరదబాధిత విద్యార్థుల కుటుంబాలకు కూడా తానా ఫౌండేషన్‌ ఇటీవల సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వరదల కారణంగా కొన్ని స్కూళ్ళలో బెంచీలు, కుర్చీలు వంటి సామాగ్రికి తీవ్ర నష్టం కలిగింది. వీటికి తగిన చర్యలు చేపట్టవలసిందిగా యువ నాయకులు శ్రీ తుమ్మల యుగంధర్‌  సూచన చేయగా వీటి మరమ్మతులకోసం ఫౌండేషన్‌ తరపున 2 లక్షల రూపాయలను ఆయా స్కూళ్ళకు విరాళంగా అందజేస్తున్నట్లు శశికాంత్‌ వల్లేపల్లి తెలిపారు. వెంటనే 2లక్షల రూపాయల చెక్‌ ను ఖమ్మం అర్బన్‌ విద్యాధికారి శ్రీ రాములు గారికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో యువనాయకులు శ్రీ తుమ్మల యుగంధర్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఖమ్మం లో ఉన్న అన్ని ప్రభుత్వ విద్యాలయాలకు మరింత అభివృద్దిలోకి తీసుకెళతామని తెలియజేస్తూ, తానా ఫౌండేషన్‌ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమైనవని అంటూ, ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి, తానా ప్రెసిడెంట్‌ నిరంజన్‌ శృంగవరపు, ఇసి టీమ్‌ ను అభినందించారు. 

ఈ కార్యక్రమానికి సహకరించిన సహస్ర మినిస్ట్రీస్‌ అధ్యక్షులు శ్రీ లాల్‌ బహుదూర్‌ శాస్త్రి గారికి, తానా ప్రెసిడెంట్‌ నిరంజన్‌ శృంగవరపుకు, భక్తభల్లాకు, శశికాంత్‌వల్లేపల్లికి బాలికలు, వారి తల్లితండ్రులు ధన్యవాదాలు తెలిపారు. 

స్కూల్‌ బెంచ్‌కు విరాళం అందించినందుకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తానా ఫౌండేషన్‌ కు ధన్యవాదాలు చెప్పారు. 

ఈ కార్యక్రమంలో డా.  శ్రీ కూరపాటి ప్రదీప్‌, ఎంఇఓ శ్రీ రాములు, ఎన్నారై ఫౌండేషన్‌ అధ్యక్షులు బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వర్‌ రావు, పసుమర్తి రంగారావు, శ్రీ గడ్డం వేంకటేశ్వర రావు, ప్రిన్సిపాల్స్‌  అసోసియేషన్‌ అధ్యక్షలు వాసిరెడ్డి శ్రీనివాస్‌ ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :