ASBL Koncept Ambience
facebook whatsapp X

తానా కాన్ఫరెన్స్‌ వెన్యూ చూసిన నాయకులు

తానా కాన్ఫరెన్స్‌ వెన్యూ చూసిన నాయకులు

డెట్రాయిట్‌లో 2025 జులై 3 నుండి 5వ తేదీ వరకు నిర్వహించనున్న 24వ తానా ద్వైవార్షిక మహాసభల నిధుల సేకరణ, సన్నాహక సమావేశంలో భాగంగా డెట్రాయిట్‌ వచ్చిన తానా నాయకులు మహసభలు జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. 24వ మహాసభల సమన్వయకర్త చాపలమడుగు ఉదయకుమార్‌ మాట్లాడుతూ, ఈ తానా కాన్ఫరెన్స్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించడంతోపాటు అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో నోవి సబర్సన్‌ షో ప్లేస్‌ ను వెన్యూగా ఎంపిక చేసినట్లు చెప్పారు. డిట్రాయిట్‌లో తెలుగువాళ్ళ సంఖ్య అధికంగా ఉండటంతోపాటు, అన్నీ ప్రాంతాలకు డిట్రాయిట్‌ సమమైన దూరంలో ఉన్నందున ఈ వెన్యూను ఎంపిక చేసినట్లు ఉదయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయ్‌ కుమార్‌ చాపలమడుగుతోపాటు కాన్ఫరెన్స్‌ ఛైర్మన్‌ నాదెళ్ల గంగాధర్‌, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ నరేన్‌ కొడాలి, తానా కార్యదర్శి రాజా కసుకుర్తి, పూర్వ అధ్యక్షులు జయరామ్‌ కోమటి, అంజయ్య చౌదరి లావు, బోర్డ్‌ సభ్యులు రవి పొట్లూరి, జో పెద్దిబోయిన, వెంకట్‌ కోగంటి, సునీల్‌ పంట్రతోపాటు ఇతర తానా కార్యవర్గ సభ్యులు, బోర్డ్‌ సభ్యులు వెన్యూను సందర్శించిన వారిలో ఉన్నారు. 

సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌ 

సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌ ఎక్స్‌పోజిషన్‌ మరియు ఈవెంట్‌ హాల్స్‌లో 300కి పైగా చదరపు అడుగుల ఎక్స్‌పో స్థలం ఉంది. డైమండ్‌ కాన్ఫరెన్స్‌ సెంటర్‌ మరియు లెగసీ ఈవెంట్‌ సెంటర్‌ 4 బాల్‌రూమ్‌ మరియు 38 మీటింగ్‌/బాంకెట్‌ రూమ్‌లు ఉన్నాయి. 126 సూట్‌ స్టైల్‌ రూమ్‌లతో హయత్‌ ప్లేస్‌ హోటల్‌ కూడా ఇక్కడే ఉంది. వాహనాల పార్కింగ్‌కు విశాలమైన స్థలం కూడా ఉంది.

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :