ASBL Koncept Ambience
facebook whatsapp X

ఫిలడెల్ఫియా లో తానా సాంస్కృతిక పోటీలు 

ఫిలడెల్ఫియా లో తానా సాంస్కృతిక పోటీలు 

తానా మిడ్ అట్లాంటిక్ బృందం అక్టోబర్ 26న ఫిలడెల్ఫియాలో సాంస్కృతిక పోటీలను విజయవంతంగా నిర్వహించింది. గానం, నృత్యం విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో 150 మందికి పైగా పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్లాసికల్ మరియు నాన్ క్లాసికల్ విభాగాలలో జరిగిన ఈ పోటీలకు విశేష స్పందన లభించింది. దాదాపు 600 మందికి పైగా హాజరయి పోటీలలో పాల్గొన్నవారిని ప్రోత్సహించారు. మధ్యాహ్నం 12:30PM కి ప్రారంభమైన పోటీలు విరామం లేకుండా రాత్రి 10:00PM వరకు కొనసాగాయి. 

ప్రముఖ నటుడు మరియు డాన్సర్ ఇంద్రనీల్ ముఖ్య అతిథిగా విచ్చేసి శివతాండవం మరియు NBK50 మెలోడీతో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. గాయని శ్రావణి చిట్టా అతిథిగా వచ్చి ప్రేక్షకులను అలరించారు. తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ఇంద్రనీల్ మరియు శ్రావణి చిట్టాలను సత్కరించి వాలంటీర్లు, దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి వెంకట్ సింగు, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటిల సహకారంతో సురేష్ యలమంచి, కృష్ణ నందమూరి సాంస్కృతిక పోటీలు విజయవంతంగా నిర్వహించారు. ఫణి కంతేటి, విశ్వనాధ్ కోగంటి, సరోజా పావులూరి, రాజేశ్వరి కంతేటి, రంజిత్ మామిడి, చందు బసుత్కర్, చలం పావులూరి, వెంకట్ గూడూరు, భవినీ మామిడి, ప్రసాద్ క్రొత్తపల్లి, సునీత వాగ్వల, నాయుడమ్మ యలవర్తి, రవీనా తుమ్మల, నీలిమ వోలేటి, గోపి వాగ్వాల, భవాని క్రొత్తపల్లి, మనీషా మేక, గీత పొన్నగంటి, వ్యోమ్ క్రొత్తపల్లి, కృషిత నందమూరి, ధీరజ్ యలమంచి, మాన్విత యాగంటి తదితరులు ఈ  సాంస్కృతిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేశారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :