ASBL Koncept Ambience
facebook whatsapp X

పోటాపోటీగా సాగిన తానా పికిల్ బాల్ టోర్నమెంట్

పోటాపోటీగా సాగిన తానా పికిల్ బాల్ టోర్నమెంట్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కమ్యూనిటీకోసం వివిధ రకాల కార్యక్రమాలతోపాటు, పలు ఆటల పోటీలను కూడా నిర్వహిస్తోంది. తానా స్పోర్ట్స్ కమిటీ చైర్ గా ఉన్న నాగపంచుమర్తి వివిధ ఆటల పోటీలను నిర్వహిస్తూ ఆటగాళ్ళ ప్రతిభను అందరికీ పరిచయం చేస్తున్నారు. పికిల్ బాల్ కు ఉన్న క్రేజీని దృష్టిలో పెట్టుకుని తానా అక్టోబర్ 5వ తేదీన ఛార్లెట్ లోనూ, 6వ తేదీన రాలేలోనూ పికిల్ బాల్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేసింది. మెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ తోపాటు వివిధ లెవెల్ లో పోటీలను నిర్వహించింది. ఈ పోటీలకు మంచి స్పందన వచ్చిందని, ఎన్నో టీమ్ లు పాల్గొన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులను అందించారు. జూనియర్స్ డబుల్స్ లో వేదాంశ్ లంకాల, హర్షిత్ చౌదరి, రన్నరప్ గా అజయ్ తాడ్వాయి, యువన్ ఎస్ యలమంచిలి, మూడవ ప్లేస్లో సిరి మణికొండ, శ్రీరామ్ మణికొండ నిలిచారు. ఉమెన్స్ డబుల్స్ లో పల్లవి, అనిత ఎస్ విజేతలుగా నిలవగా, రన్నరప్ గా అనిత కుప్పుస్వామి, షెల్లి ఓహ్ నిలిచింది. మిక్స్ డ్ డబుల్స్ లో అరిన్ బి, శ్రీని జి, విజేతలుగా నిలవగా, రన్నరప్ గా జీ బెంటన్, తారక నరేంద్ర పుడి, 3వ ప్లేస్ లో పల్లవి బొల్లూరు, జే బొల్లూరు నిలిచారు. 

రాజేష్ యార్లగడ్డ (తానా అప్పలాచియాన్ రీజినల్ రిప్రజంటెటివ్), పురుషోత్తం చౌదరిగూడె (ఫౌండేషన్ ట్రస్టీ), కిరణ్ కొత్తపల్లి (తానా టీమ్ స్క్వేర్ చైర్మన్), ఠాగూర్ మల్లినేని (ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్), నాని వడ్లమూడి, తారక్పూడి, కార్తిక్ పండ్ర తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :