ASBL Koncept Ambience
facebook whatsapp X

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు

కెనడా టొరంటో లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఘనంగా సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు. ఖండాంతరాలు దాటిన తెలుగు ఖ్యాతి

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో టొరంటో-కెనడా నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో 2500కు పైగా తెలంగాణ వాసులు స్థానిక లింకన్ అలెగ్జాండర్ సెకండరీ స్కూల్ - మిస్సిసాగా లో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు.

ఈ సంవత్సరం విశేష స్పందనతో అనూహ్య విధంగా బతుకమ్మలను తీసుకువచ్చి టొరంటో తెలంగాణ ప్రజలు బతుకమ్మలపై వారికి ఉన్న భక్తిని చాటుకున్నారు మరియు పలు వంటకాలతో పాట్ లాక్ విందు భోజనం సమకూర్చారు. ఈ సందర్బంగా కమిటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ సంబరాలపై వారికి ఉన్న భక్తిశ్రద్ధలను కొనియాడారు. తెలంగాణ కెనడా సంఘం ఈ సందర్భంగా వారి అధికారిక తెలుగు పత్రిక TCA బతుకమ్మ సంచికను శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి గారు ఆవిష్కరించి ముందుగా  పాలకామండలి ఆడపడుచులకు అందజేశారు. ఈ సంబరాలలో బతుకమ్మ ఆట సుమారు 5 గంటలు ఏకధాటిగా ఆట పాటలతో చివరగా పోయిరావమ్మ గౌరమ్మ పాటతో ఊరేగిపుంగా వెళ్లి నిమజ్జనం చేశారు. తరువాత సత్తుపిండి, నువ్వులపిండి, పల్లీలపిండి ప్రసాదం పంపిణి చేసారు. 

ఈ సంవత్సరం బతుకమ్మలలో అత్యుత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి విజేతలకి విభూతి ఫ్యాబ్ స్టూడియోస్ వారు మరియు తెలంగాణ కెనడా అసోసియేషన్ వారు బహుమతులను అందజేశారు. బతుకమ్మ పండుగకి విచ్చేసిన వారికి రాఫెల్ డ్రా నిర్వహించి గెలిచిన వారికి ఒక గ్రాము బంగారం బహుమతిగా అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి శ్రీ శంతన్ నేరళ్లపల్లి, సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ అర్ర , సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, కోశాధికారి శ్రీ వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి శ్రీ రాహుల్ బాలనేని, డైరెక్టర్లు - శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి, శ్రీ ప్రణీత్ పాలడుగు, శ్రీమతి శ్రీరంజని కందూరి, శ్రీ ప్రవీణ్ కుమార్ సామల ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ అతిక్ పాషా గారు, వ్యవస్థాపక సభ్యులు - శ్రీ హరి రావుల్, శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి, శ్రీ సంతోష్ గజవాడ,  శ్రీ ప్రకాష్ చిట్యాల, శ్రీ కలీముద్దీన్ మొహమ్మద్,  శ్రీ శ్రీనివాస తిరునగరి,  శ్రీ అఖిలేష్ బెజ్జంకి,  శ్రీ రాజేశ్వర్ ఈధ, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం పాల్గొన్నారు. కార్యక్రమం చివర్లో అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు సహకరించిన టొరంటో తెలుగు ప్రజల్ని అభినందించారు మరియు స్వచ్ఛంద  స్వచ్ఛంద సేవకులను, గవర్నింగ్ బోర్డ్ సహకారాలని ఎంతో కొనియాడారు. చివరగా తెలంగాణ కెనడా అసోసియేషన్ స్పాన్సర్లకు మరియు డిన్నర్ పాట్ లాక్ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.

 

Click here for Photogallery

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :