ASBL Koncept Ambience
facebook whatsapp X

పోర్ట్‌ల్యాండ్‌లో ఘనంగా టీడీఫ్ బతుకమ్మ మరియు దసరా సంబరాలు

పోర్ట్‌ల్యాండ్‌లో ఘనంగా టీడీఫ్ బతుకమ్మ మరియు దసరా సంబరాలు

తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్‌ల్యాండ్‌ సిటీ చాప్టర్ ఆధ్వర్యములో బతుకమ్మ మరియు దసరా పండుగల ఉత్సవాలు కన్నుల పండుగ గా  వైభవోపేతంగా జరిగాయి. Quatama Elementary School ఆదివారం జరిగిన ఈ వేడుకలని చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిచారు. ఆదివారము రోజున ఘనంగా జరిగిన ఈ వేడుకలకి పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుండి పెద్ద యెత్తున పాల్గొని  విజయవంతం చేసారు. ఈ వేడుకకి మహిళలు మరియు చిన్నారి అమ్మాయిలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆట పాటల తో సందడి చేసారు. బతుకమ్మ నిమజ్జనం తర్వాత మహిళలు అందరు గౌరమ్మ మరియు ప్రసాదం ని ఇచ్చి పుచ్చుకున్నారు. దసరా ఉత్సవాన్ని షమీ స్తోత్రం అందరితో పఠింప చేసి జమ్మి చెట్టుకి పూజ చేసి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్ భలాయ్ చేసికున్నారు. బతుకమ్మ మరియు రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేశారు. వేడుకలో పాల్గొన్న వారందరికీ రుచికరమైన భోజనం ని వడ్డించారు.  

ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ  శ్రీని అనుమాండ్ల TDF 25 ఏళ్ల సందర్బంగా జరుపుకుంటున్నబతుకమ్మ మరియు దసరా పండుగల శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా TDF చేస్తున్న వివిధ సహాయ కార్యక్రమలని వివరించారు. పండుగలని వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు అభినందనలు తెలిపారు.  ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించడానికి సహాయం చేసిన స్పాన్సర్స్ అందరికి శ్రీని ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వేడుకలని అత్యంత అంగ రంగ వైభవవోపేతంగా జరిపి విజయవంతం అవటానికి కృషి చేసిన పోర్ట్లాండ్ చాప్టర్ టీం మరియు వాలంటీర్స్ - వీరేష్ బుక్క, సురేష్ దొంతుల, మధుకర్ రెడ్డి పురుమాండ్ల, శ్రీపాద్ రాంబట్ల, అరుణ్ యర్రం, శ్రీని గుబ్బా, రఘు శ్యామ, జయకర్ రెడ్డి ఆడ్ల, అజయ్ అన్నమనేని, నిరంజన్ కూర, రఘు బి, నవీన్ గుడిగంట్ల, శ్రీకాంత్ నంగునూరి, భాస్కర్, కార్తీక్ రెడ్డి అనుమాండ్ల, రాజ్ ఆందోల్ మరియు వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ప్రశంసలు తెలియ చేసారు. చివరగా వేడుకల్లో పాల్గొన్న పోర్ట్లాండ్ ఇండియన్ కమ్యూనిటికి, సహకారం చేసిన మిత్రులకి, శ్రేయలోభిలాషులకి TDF టీమ్ తరుపున అభింకందనలు తెలిపారు.

 
  

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :