ASBL Koncept Ambience
facebook whatsapp X

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి .. టెక్‌ సీఈఓలకు మోదీ పిలుపు

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి .. టెక్‌ సీఈఓలకు మోదీ పిలుపు

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తో సహా సాంకేతిక పరిశ్రమ దిగ్గజాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఆవిష్కరణల కోసం భారతదేశ వృద్థి కథనాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్‌ తదితర అత్యాధునిక రంగాలపై చర్చలు జరిగాయి. బయోటెక్నాలజీ,  లైఫ్‌సైన్సెస్‌-కంప్యూటింగ్‌, ఐటీ`కమ్యూనికేషన్‌, సెమీకండక్టర్‌ టెక్నాలజీలపై చర్చించారు. మేథో సంపత్తిని రక్షించడానికి, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి భారతదేశ లోతైన నిబద్ధత గురించి వివరించారు. ఆర్థిక పరివర్తనను మరింత హైలైట్‌ చేస్తూ, సెమీకండక్టర్ల తయారీలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.

అలాగే భారతదేశాన్ని బయోటెక్‌ పవర్‌హౌస్‌గా అభివృద్ధి చేయడానికి భారతదేశ బయో `ఇ3 విధానాన్ని కూడా హైలైట్‌ చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై మాట్లాడుతూ నైతిక, బాధ్యతాయుతమై ఉపయోగం ద్వారా అందరికీ మేలు జరగాలన్నదే తమ ఉద్దేశమన్నారు. 

ఈ సమావేశంలో యాక్సెంచర్‌ (జూలీ స్వీట్‌), అడోబ్‌ ( శాంతను నారయణ్‌), గూగుల్‌, హెచ్‌పిఇంక్‌. ( ఎన్రిక్యూ లోర్స్‌), ఎఎమ్‌డి ( లిసా సు), బయోజెన్‌ ఇంక్‌. ( క్రిస్‌ విప్‌ాబాచెర్‌), బ్రిస్టల్‌ మైయర్స్‌ స్క్విబ్‌ ( క్రిస్‌ బోర్నర్‌), ఎలి లిల్లీ అండ్‌ కంపెనీ ( డేవిడ్‌ ఎ.రిక్స్‌), ఐబీఎం ( అరవింద్‌ కృష్ణ),  లామ్‌ రీసెర్చ్‌ ( టిమ్‌ ఆర్చర్‌), మోడెర్నా ( నౌబర్‌ అఫెయన్‌), వెరిజోన్‌ ( హన్స్‌ వెస్ట్‌బర్గ్‌), గ్లోబల్‌ ఫౌండరీస్‌ (థామస్‌ కాల్‌ఫీల్డ్‌), ఎన్విడియా ( జెన్సన్‌ హువాంగ్‌), కిండ్రిల్‌ ( మార్టిన్‌ ష్రోటర్‌) తదితర సంస్థల సీఈవోలు హాజరయ్యారు. 

 

 


 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :