ASBL Koncept Ambience
facebook whatsapp X

కొడుకు కోసం తేజ హోం వ‌ర్క్

కొడుకు కోసం తేజ హోం వ‌ర్క్

టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ ఒక‌ప్పుడు వ‌రుస‌పెట్టి సినిమాలు చేశాడు. నేనే రాజు నేనే మంత్రి త‌ర్వాత ఆయ‌న్నుంచి వ‌చ్చిన అహింస డిజాస్ట‌ర్ అయింది. అయిన‌ప్ప‌టికీ రానా తేజపై నమ్మ‌కంతో మ‌రో సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా అనౌన్స్ అయింది కానీ ఇంకా షూటింగ్ కు వెళ్ల‌లేదు.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం తేజ కొత్త క‌థ‌ల‌పై దృష్టి సారించాడ‌ని, కొంద‌రు ర‌చ‌యిత‌ల క‌థ‌లు వింటున్నార‌ని సినీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది. త‌న కొడుకు ఎంట్రీకి ఇదే స‌రైన స‌మ‌యంగా భావించి తేజ ఓ క‌థ‌ను ఫిక్స్ చేశార‌ని, ఈ క‌థ ఫాంట‌సీ జాన‌ర్ లో ఉంటుంద‌ని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకు హ‌నుమంతు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం.

ఈ ఫాంట‌సీ క‌థ‌లో ల‌వ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయ‌ని ఇప్ప‌టికే తేజ ఈ ప్రాజెక్ట్ కోసం హోం వ‌ర్క్ స్టార్ట్ చేశాడ‌ని, క‌థ‌లోని పాత్ర‌కు స‌రిపోయే విధంగా తేజ త‌న కొడుకుని ట్రైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట‌ర్ గా ఎన్నో హిట్స్ అందుకున్న తేజ గ‌త కొంత‌కాలంగా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. త‌న కొడుకు సినిమాతో ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల‌ని తేజ చూస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :