ASBL Koncept Ambience
facebook whatsapp X

ఘనంగా టిటిఎ న్యూయార్క్‌ బతుకమ్మ వేడుకలు 

ఘనంగా టిటిఎ న్యూయార్క్‌ బతుకమ్మ వేడుకలు 

తెలంగాణా అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టిటిఎ) ఆధ్వర్యంలో తెలంగాణ సంప్రదాయపండుగ  బతుకమ్మ వేడుకలను ఇటీవల న్యూయార్క్‌లోని రాడిసన్‌ హోటల్‌లో నిర్వహించింది. 1000 మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టిటిఎ వ్యవస్థాపకుడు, డాక్టర్‌ పైళ్ల మల్లా రెడ్డి మరియు ఇతర ప్రముఖులు వారి కుటుంబ సమేతంగా హాజరుకావడంతో పండుగ ప్రాముఖ్యత పెరిగింది. అందరికీ పైళ్ళ మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ లలితా సహస్రనామ పారాయణంతో, దుర్గామాతకి భక్తిపూర్వకంగా ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమైంది. సంప్రదాయ దుస్తులు, నగలు ధరించి వందలాది మంది మహిళలు బతుకమ్మ నృత్యంలో పాల్గొని సంప్రదాయబద్ధంగా ఆడడంతో వాతావరణం శోభాయమానంగా మారింది. జానపద గాయకుడు జనార్దన్‌ పన్నెల తన మధురమైన బతుకమ్మ పాటలు మరియు నృత్యాలతో ప్రేక్షకులను మరింత అలరించారు. అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ముఖ్యమైన హైలైట్‌గా నిలిచాయి. యువత చేసిన నృత్యాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి, అదే సమయంలో అమ్మవారికి అద్భుతమైన శాస్త్రీయ నృత్యాన్ని అందించారు. బతుకమ్మలను పక్కనే ఉన్న నీటి చెరువులో నిమజ్జనం చేయడంతో వేడుక ముగిసింది. రుచికరమైన మరియు విలాసవంతమైన సాంప్రదాయ తెలంగాణ భోజనంను వచ్చినవారికి అందించారు.  దుస్తులు మరియు ఆభరణాలను అందించే బహుళ విక్రేతల నుండి షాపింగ్‌ కేళి అందించబడిరది. సాయంత్రం ఉత్సాహపూరితమైన దాండియా మరియు ఓపెన్‌ డ్యాన్స్‌ తో కార్యక్రమాలు ముగిశాయి.

డా. పైళ్ల మల్లా రెడ్డి గారు ఈ వేడుకకు ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహంపై వచ్చినవారు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఇంత గొప్ప వేడుకలను నిర్వహించినందుకు టిటిఎ న్యూయార్క్‌ బృందాన్ని పలువురు ఈ సందర్భంగా ప్రశంసించారు.

టిటిఎ జాతీయ కోశాధికారి సహోదర్‌ పెద్దిరెడ్డి ఏకకాలంలో బతుకమ్మ సంబరాలను హైలైట్‌ చేసి సీటెల్‌ సదస్సును విజయవంతం చేసి దాతలను సత్కరించారు. రీజనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సత్య ఎన్‌. రెడ్డి గగ్గెనపల్లి నేతృత్వంలోని న్యూయార్క్‌ టీమ్‌ అందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ కోశాధికారి సహోదర్‌ పెద్దిరెడ్డి, బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఉషారెడ్డి మన్నెం, మల్లిక్‌ రెడ్డి, పవన్‌ రవ్వ, రామ వనమా, ఆర్‌విపి సత్య గగ్గెనపల్లి, స్టాండింగ్ కమిటీ సభ్యులు శరత్‌ వేముగంటి, శ్రీనివాస్‌ గూడూరుతో పాటు రీజినల్‌ కోఆర్డినేటర్లు సునీల్‌ గడ్డం, వాణి సింగిరికొండ, సౌమ్య చిరుకొండ, విజేందర్ రెడ్డి మరియు హరిచరణ్‌ బొబ్బిలి తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు. స్థానిక సంఘాలు, న్యూయార్క్‌ తెలంగాణా తెలుగు అసోసియేషన్‌ (టిటిఎన్‌వై), తెలుగు లిటరరీ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ (టిఎల్‌సిఎ) నాయకులు ఈ కార్యక్రమానికి తమ మద్దతును తెలియజేశారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :